Kachidi Fish: మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప.. దాని ధరెంతో తెలుసా?
ABN, First Publish Date - 2023-07-22T15:00:34+05:30
కాకినాడలో ఒక అరుదైన చేప మత్స్యకారులకు చిక్కింది. ఆ చేపతో మత్స్యకారులు లక్షలు సంపాదించారు. ఈ చేపను వేలం వేయగా.. దాదాపు రూ.3.30 లక్షలకు పలికింది. వేలం వేయడంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి రూ.20 వేలు కమిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాకినాడ: కాకినాడలో ఒక అరుదైన చేప మత్స్యకారులకు చిక్కింది. ఆ చేపతో మత్స్యకారులు లక్షలు సంపాదించారు. ఇంతకీ మత్స్యకారులకు చిక్కిన చేప ఏదంటే... అనేక వ్యాధులకు తయారుచేసే ఔషధాల్లో ఉపయోగించే ‘‘కచిడి’’ చేప. కాకినాడ కుంభాభిషేకం రేవులో మత్స్యకారులు వలకి ఈ కచిడి చేప చిక్కింది. వెంటనే ఈ చేపను వేలం వేయగా.. దాదాపు రూ.3.30 లక్షలకు పలికింది. కచిడి చేప బరువు 25 కేజీలు ఉంటుంది. వేలం వేయడంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి రూ.20 వేలు కమిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మత్స్యకారుల చేతికి రూ.3.10లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాలు తయారీకి ఉపయోగపడతాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గ్లార్ బ్లాడర్‌త తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అనేక వ్యాధులకు తయారుచేసే ఔషధాల్లో కచిడి చేపను ఉపయోగిస్తుంటారు. పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలో ఎక్కువగా ఈ చేపను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే ఈ చేప లక్షల్లో డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
Updated Date - 2023-07-22T15:16:28+05:30 IST