Share News

కార్తీకం కళ!

ABN , First Publish Date - 2023-11-14T00:29:58+05:30 IST

మంగళవారంనుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరమైన నెల. జిల్లాలో శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు వేలాదిమంది భక్తులతో కళకళలాడతాయి. జిల్లాలో వందకు పైగా శైవ, వైష్ణవ క్షేత్రాల్లో కార్తీక మాసం పూజలు నిర్వహిస్తారు

కార్తీకం కళ!

  • నేటినుంచే కార్తీక మాసం ప్రారంభం

  • జిల్లాలో శైవక్షేత్రాలకు ఆధ్యాత్మిక శోభ

  • శివకేశవులకు ప్రీతికర మాసం

  • పిఠాపురం పాదగయలో నెలరోజులపాటు ఆలయ దర్శన వేళలు పెంపు

  • విస్తృత ఏర్పాట్లు.. పుష్కరిణికి కొత్త నీరు

  • పదిలక్షల మందికిపైగా వస్తారని అంచనా

మంగళవారంనుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరమైన నెల. జిల్లాలో శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు వేలాదిమంది భక్తులతో కళకళలాడతాయి. జిల్లాలో వందకు పైగా శైవ, వైష్ణవ క్షేత్రాల్లో కార్తీక మాసం పూజలు నిర్వహిస్తారు. ఈ నెలల్లో ఈ క్షేత్రాల్లో ఆకాశ దీపంవెలిగిస్తారు. మంగళవారం ప్రారంభమై డిసెంబరు 12తో కార్తీకమాసం ముగుస్తుంది. ఏటా దీపావళి మర్నాడే కార్తీకమాసం ప్రారంభమయ్యేది. కానీ ఈ ఏడాది దీపావళి మర్నాడు కాకుండా రెండో రోజునుంచి కార్తీకమాసం మొదలైంది. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే నెల ప్రారంభానికి సూచన. ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మ ముహర్తంలోనే. అందుకే నేటి సూర్యోదయం సమయానికి పాఢ్యమి ఉండడంతో ఆకాశదీపం ప్రారంభమవుతుంది.

పిఠాపురం, నవంబరు 13: పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రంలో కార్తీక మాసోత్సవం మంగళవారం ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జరిగే ప్రత్యేక పూజలు, పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ దర్శన వేళలను పెంచారు.

డిసెంబరు 12 వరకు..

పట్టణంలోని పాదగయ క్షేత్రంలో జరిగే కార్తీక మాస పూజలకు విశిష్టత ఉంది. స్వయంభూగా వెలిసిన ఉమాకుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన రాజరాజేశ్వరీదేవి, అష్టాదశశక్తి పీఠాల్లో దశమిశక్తి పీఠం అధిష్టాన దేవతైన పుర్హుతికాఅమ్మవారు కొలువైఉన్న పాదగయకు ఈరోజుల్లో ఉభయ తెలుగురాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి పదిలక్షలకు పైగా భక్తులు తరలివస్తారు. విశేష ప్రాచుర్యం ఉన్న పాదగయ పుష్కరిణిలో ఐదులక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. ఇందుకోసం పుష్కరిణిలో పాత నీటిని తొలగించి శుభ్రపరచి కొత్తనీటిని పెట్టారు. మంగళవారంనుంచి ప్రారంభమయ్యే కార్తీక మాస పూజలు డిసెంబరు 12వతేదీ వరకూ కొనసాగనున్నాయి. కార్తీ క సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి, మాసశివరాత్రి తదితర పర్వదినాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. భక్తులు అధికంగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దర్శన వేళలను పెంచారు. ఈనెల రోజులపాటు ఆలయాన్ని తెల్లవారుజామున 3గంటలకే తెరిచి మధ్యా హ్నం ఒంటిగంట వరకూ, మధ్యాహ్నం 3నుంచి రాత్రి 9 గంటల వరకూ దర్శనాలకు అనుమతిస్తారు.కార్తీక పౌర్ణ మి, సోమవారాలు, ఇతర పర్వదినాల సమయంలో ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. నెలరోజులపాటు స్వయంభూ లింగమూర్తి రాజరాజేశ్వరీ సమేత ఉమాకుక్కుటేశ్వరస్వామికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు.

ఉచితంగా ప్రసాదాల పంపిణీ

కార్తీకమాస పర్వదినాల సమయంలో భక్తులకు ఉచిత ప్రసాదాలు అందించనున్నారు. ఉచిత పులిహోర ప్రసాదంతోపాటు చిన్నారులకు పాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. అన్నదానాన్ని ఎక్కువమందికి అందించేందుకు చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు చేశామని ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఆగంటి ప్రభాకరరావు, ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు.

సామర్లకోట భీమేశ్వరాలయం కళకళ

సామర్లకోట, నవంబరు 13: కార్తీకమాసం నెలరోజులపాటు సా మర్లకోట కుమారరామ భీమేశ్వరాలయంలో విశేష పూజలు నిర్వ హించేందుకు ఆలయ ఈవో డి.నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సోమవారం నాటికి పూర్తిచేశారు. ఈనెల రోజులూ ఆల యంలో ప్రతిరోజూ జరగనున్న విశేష పూజలకు జిల్లానుంచేగాక రాష్ట్ర నలుమూలలనుంచీ అధికసంఖ్యలో భక్తులు చేరుకోనున్నారు. అందుకు తగిన రీతిలో ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ వివిధప్రాంతాలనుంచి చేరుకుని లక్షపత్రి పూజలు నిర్వహిం చుకునేలా ఏర్పాట్లు చేశారు. పంచారామ దర్శిని పేరిట రాష్ట్ర నలు మూలలనుంచీ బస్సుల్లో చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడ పడంతో నిత్యం వేలాది భక్తులు చేరుకోనున్నారు.

Updated Date - 2023-11-14T00:30:00+05:30 IST