Kakinada: లోకేష్ 217వ రోజు యువగళం పాదయాత్ర
ABN, First Publish Date - 2023-12-04T08:29:11+05:30
కాకినాడ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 217వ రోజు యువగళం పాదయాత్ర సోమవారం శీలంవారిపాకలు జంక్షన్ నుంచి ప్రారంభం కానుంది. యువగళం యాత్రకు పల్లెలకు పల్లెలు కదిలొస్తున్నాయి. ఎటు చూసినా జనమే.. అడుగుతీసి అడుగువేయలేనతంగా జనం కదిలొస్తున్నారు.
కాకినాడ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 217వ రోజు యువగళం పాదయాత్ర సోమవారం శీలంవారిపాకలు జంక్షన్ నుంచి ప్రారంభం కానుంది. యువగళం యాత్రకు పల్లెలకు పల్లెలు కదిలొస్తున్నాయి. ఎటు చూసినా జనమే.. అడుగుతీసి అడుగువేయలేనతంగా జనం కదిలొస్తున్నారు. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు లోకేష్‌కు హారతులు ఇస్తూ, ఆశీర్వదిస్తూ పాదయాత్రకు నీరాజనం పలుకుతున్నారు. ప్రజలంతా రహదారిపైకి వచ్చి స్వాగతం పలకగా వారిని యువనేత ఆప్యా యంగా పలకరిస్తూ, సమస్యలు వింటూ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా ఆదివారం లోకేష్ 9.6 కి.మీ. నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,974 కి.మీ. నడిచారు.
సోమవారం లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు..
ఉదయం
8.00 – శీలంవారిపాకలు జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.30 – కోనపాపపేటలో మత్స్యకారులతో సమావేశం.
11.00 – శ్రీరాంపురంలో ఎస్సీలతో భేటీ
11.05 – పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
12.05 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద భోజన విరామం.
3.00 – కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశం.
సాయంత్రం
4.00 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – బుచ్చయ్యపేట సెంటర్‌లో గ్రామస్తులతో సమావేశం.
6.00 – వాకదారిపేట సెంటర్‌లో మాటామంతీ.
6.45 – పెరుమాళ్లపురం దివీస్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులతో సమావేశం.
7.00 – ఒంటి మామిడి కొత్తపాకల వద్ద ఆక్వా రైతులతో భేటీ
7.45 – ఒంటిమామిడి వద్ద విడిది కేంద్రంలో రాత్రి బస.
Updated Date - 2023-12-04T08:29:13+05:30 IST