ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvagalam: నారా లోకేష్ యువగళంకు విశేష స్పందన

ABN, First Publish Date - 2023-12-11T08:12:40+05:30

తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 219వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు తేటగుంట పంజాబీ దాబా వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.

తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 219వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు తేటగుంట పంజాబీ దాబా వద్ద నుంచి ప్రారంభమవుతుంది. లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు.

219వరోజు సోమవారం యువగళం వివరాలు

– ఉదయం 8.00 తేటగుంట పంజాబీ దాబా వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

– 8.15 తేటగుంట యనమల గెస్ట్ హౌస్ వద్ద యువగళం 3వేల కి.మీ. అధిగమించిన సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ.

– 9.30 తేటగుంట పద్మనాభ ఫంక్షన్ హాలు వద్ద డాక్టర్లతో సమావేశం.

– 11.30 చామవరం గేటు వద్ద స్థానికులతో భేటీ.

– 11.45 ఎస్. అన్నవరం సాయివేదిక వద్ద భోజన విరామం.

– 2.00 ఎస్.అన్నవరం సాయివేదిక వద్ద కాపు సామాజికవర్గీయులతో ముఖాముఖి.

సాయంత్రం

– 4.00 ఎస్.అన్నవరం సాయివేదిక వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

– 4.30 తుని హెచ్‌పి పెట్రోలు బంకు వద్ద స్థానికులతో మాటామంతీ.

– 4.40 తుని ఎన్టీఆర్ విగ్రహం సెంటర్‌లో లేబర్ యూనియన్ ప్రతినిధులతో భేటీ.

– 4.55 తుని శ్రీరామ థియేటర్ వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

– 5.25 తుని గొల్ల అప్పారావు సెంటర్ లో స్థానికులతో భేటీ

– 5.30 పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశం.

– 5.50 పాయకరావుపేట జుడియో షోరూమ్ వద్ద స్థానికులతో సమావేశం.

– 6.20 పాయకరావుపేట ‌ కార్యాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.

– 6.30 పాయకరావుపేట హైవే ముఖద్వారం వద్ద స్థానికులతో భేటీ.

– 7.00 పిఎల్‌పురం వద్ద యువతతో సమావేశం.

– 7.30 సీతారాంపురంలో స్థానికులతో మాటామంతీ.

– 8.00 నామవరం క్యాంప్ సైట్ వద్ద విడిది కేంద్రంలో బస.

3 వేల మైలురాయికి యువగళం

కాగా లోకేశ్‌ పాదయాత్ర తేటగుంట ప్రాంతానికి సమీపంలో 3వేల కిలోమీటర్ల మైలురాయికి చేరురుకుంది. రాత్రి బస చేసిన తేటగుంట హైవేకి చేరేసరికి మొత్తం 3,006.7 కిలోమీటర్లు పూర్తయింది. 3వేల కి.మీ. మైలురాయికి గుర్తుగా సోమవారం లోకేశ్‌ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సాగిన యువగళం పాదయాత్రకు కనివినీ ఎరుగని రీతిలో జనం నీరాజనం పట్టారు. లోకేశ్‌ను చూసేందుకు వేలల్లో జనం ఎగబడ్డారు.

Updated Date - 2023-12-11T08:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising