ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dwarampudi: పవన్ తోకముడిచారేం.. ప్రకటన కోసం వేచి చూస్తున్నా..

ABN, First Publish Date - 2023-06-20T15:48:56+05:30

వారాహి యాత్రలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ద్వారంపూడి కూడా అదే స్థాయిలో పవన్‌‌కు కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోసారి పవన్‌ కళ్యాణ్‌పై ద్వారంపూడి విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ జిల్లా: వారాహి యాత్రలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ద్వారంపూడి కూడా అదే స్థాయిలో పవన్‌‌కు కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోసారి పవన్‌ కళ్యాణ్‌పై ద్వారంపూడి విరుచుకుపడ్డారు. ‘‘పవన్ కళ్యాణ్ కాకినాడలో నా మీద పోటీ చేస్తాననే ప్రకటన చేయకుండా కాకినాడ నుంచి తోక ముడుచుకుని వెళ్ళిపోతున్నారు. పోటీ గురించి ప్రకటన కోసం సాయంత్రం నాలుగు గంటల వరకు ఎదురు చూస్తాను. పోటీపై ప్రకటన చేయకుండా వెళ్తే నామీద చేసిన వ్యాఖ్యలు పవన్ వెనక్కి తీసుకున్నట్లుగా నేను భావిస్తాను’’ అని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ తనను తిట్టడానికి వారాహి యాత్ర మొదలుపెట్టారని మండిపడ్డారు. ఎవరో ఏదో చెబితే నమ్మేసి నోటికొచ్చినట్టు తనపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని.. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అసలు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో జనసేన పార్టీ ఉందన్నారు. ‘‘కాకినాడలో నామీద పోటీ చేస్తాననే మీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాను’’ అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా.. కాకినాడలో జరిగిన వారాహి యాత్రలో ద్వారంపూడిని పవన్ ఘాటుగా హెచ్చరించారు. ‘‘ద్వారంపూడి ఈసారి నిన్ను గెలవనివ్వను.. గుర్తుపెట్టుకో.. నీ పతనం మొదలైంది... నీ సామ్రాజ్యాన్ని కూల్చకపోతే నాపేరు పవన్ కాదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై ద్వారంపూడి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని శపథం చేశారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో తాను ఇన్‌చార్జ్ పోస్ట్ తీసుకుంటానని ద్వారంపూడి తెలిపారు. ప్రస్తుతం ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం, శపథాలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి.

Updated Date - 2023-06-20T15:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising