Share News

టీడీపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి

ABN , Publish Date - Dec 16 , 2023 | 11:53 PM

ప్రత్తిపాడు, డిసెంబరు 16: ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైందని... నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభరాజా పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ని ర్వహించారు. సత్యప్రభ మాట్లాడుతూ ఈనెల 20న విజయనగరం సమీపంలోని భోగాపురం వద్ద టీడీ

టీడీపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి
సమావేశంలో ప్రసంగిస్తున్న సత్యప్రభ

ప్రత్తిపాడు ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభ

ప్రత్తిపాడు, డిసెంబరు 16: ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైందని... నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభరాజా పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ని ర్వహించారు. సత్యప్రభ మాట్లాడుతూ ఈనెల 20న విజయనగరం సమీపంలోని భోగాపురం వద్ద టీడీపీ నేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా 2వేల మందికిపైగా కార్యకర్తలు తరలిరావాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన అంశాలు, యువగళం ముగింపు సమావేశానికి వెళ్లే ఏర్పాట్లపై చర్చించారు. అమలాపురం పార్టీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, కాకినాడ పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు కొమ్ముల కన్నబాబు, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మ ండలాల టీడీపీ నేతలు అమరాది వెంకట్రావు, బద్ది రామారావు, పైలా సాంబశివరావు, తమరాన సత్యనారాయణ, ఇతంశెట్టి భాస్కరబాబు, సూది బూరయ్య, ఎంపీపీ గంటుమళ్ళ రాజ్యల క్ష్మి, వెన్నా శివ, పర్వత సురేష్‌, మూది నారాయ ణ స్వామి, బస్వా ప్రసాద్‌, పల్లా గోపి, బొల్లు కొండబాబు, రొంగల సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - Dec 16 , 2023 | 11:53 PM