టీడీపీకి క్రైస్తవులు అండగా నిలవాలి
ABN , Publish Date - Dec 20 , 2023 | 12:13 AM
ప్రత్తిపాడు, డిసెంబరు 19: టీడీపీకి క్రైస్తవులు అండగా నిలవాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి వరుపుల సత్యప్రభ రాజా కోరారు. ఏలేశ్వ రం ఎన్.కన్వెషన్ హాల్లో ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మంగళవారం ని ర్వహించిన పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్‌మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యప్రభ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు క్రైస్తవ సోదరులు తోడ్పాటునందించాల

వరుపుల సత్యప్రభ
ప్రత్తిపాడు, డిసెంబరు 19: టీడీపీకి క్రైస్తవులు అండగా నిలవాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి వరుపుల సత్యప్రభ రాజా కోరారు. ఏలేశ్వ రం ఎన్.కన్వెషన్ హాల్లో ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మంగళవారం ని ర్వహించిన పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్‌మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యప్రభ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు క్రైస్తవ సోదరులు తోడ్పాటునందించాలన్నారు. ఏలేశ్వరం మండలంలోని పాస్టర్లకు ప్రత్యేక కమ్యూనిటీ స్థానిక ఎన్నికల్లో కో ఆప్షన్‌సభ్యుల నియామకంలో క్రైస్తవులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కేక్ కట్ చేసి అందరికీ క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో డాక్టర్ విజయ్‌బాబు, ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బు జ్జి), కౌన్సెలర్లు బొదిరెడ్డి గోపాలకృష్ణ(గోపి), మూ ది నారాయణస్వామి, కోనాల వెంకటరమణ, ఎం డగుండి నాగబాబు, పాస్టర్లు జోషప్ ఆండ్రూస్, ఇమ్మానియేల్ రాజు, రెడ్డి ఆనందపాల్, విద్యాసాగర్, యాకోబు, ప్రకాశరావు, ప్రభుదాస్, శామ్యూ ల్, టీడీపీ మండల నాయకులు పెంటకోట శ్రీధ ర్, వైభోగుల సుబ్బారావు, ధనేకుల భద్రం, జిగటాపు సూరిబాబు, ఒనుం మంగ పాల్గొన్నారు.