ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Rajahmundry Jail: బాబును కలిసేందుకు ఖైదీల ఆతృత! ఎందుకంటే..!

ABN, First Publish Date - 2023-09-13T04:33:17+05:30

అవకాశం వస్తే చంద్రబాబుకు తమ బాధలు విన్నవించాలని సెంట్రల్‌ జైలులోని ఖైదీలు ఎదురుచూస్తున్నారు

గోడు వినిపించాలని ఖైదీల ఆతృత

చంద్రబాబు హయాంలో 4 సార్లు క్షమాభిక్ష

సెంట్రల్‌ జైల్లో ఆస్పత్రి నిర్మాణమూ ఆయన చలవే

జగన్‌ వచ్చిన తర్వాత నాలుగేళ్లలో ఒక్కసారే క్షమాభిక్ష

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): అవకాశం వస్తే చంద్రబాబుకు (Chandrababu) తమ బాధలు విన్నవించాలని సెంట్రల్‌ జైలులోని ఖైదీలు (Rajahmundry Jail) ఎదురుచూస్తున్నారు. చంద్రబాబును కలవాలని తమ ఆవేదనను ఆయనకు వినిపించాలని ముఖ్యంగా జీవిత ఖైదీలు ఆతృతగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు జీవోలు ఇచ్చేది. సామాజిక, వర్గ, స్వార్థ ప్రయోజనాలకు తావులేకుండా నిబంధనలు అనుసరించి ఖైదీలను విడుదల చేసేవారు. దీంతో వాళ్లు కుటుంబం చెంతకు చేరి కొత్త జీవితాన్ని ప్రారంభించేవారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకునేవారు. ‘క్షమాభిక్ష జీవో వస్తుంది. ఇంటికి వెళ్తాం..’ అనే భరోసా అప్పట్లో ఖైదీల్లో ఉండేది. కానీ, జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఖైదీలను పట్టించుకున్న పాపాన పోలేదు. గత నాలుగేళ్లలో ఒకే ఒక్కసారి ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. చివరికి పరోల్‌, పర్లో రావడానికి కూడా ఖైదీలు, వారి కుటుంబసభ్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ జైలుకు వచ్చిన చంద్రన్నకు తమ గోడు విన్నవించుకోవాలని ఖైదీలు ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని ములాఖత్‌కు వచ్చిన కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావిస్తున్నారు. మరోవైపు జైలు సిబ్బంది కూడా పీఆర్‌సీ గురించి చంద్రబాబుకు చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

2017లో ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన..

2017లో చంద్రబాబు సీఎం హోదాలో సెంట్రల్‌ జైలుకు వచ్చారు. ప్రస్తుతం ఆయనకు కేటాయించిన స్నేహ బ్లాకు ఎదురుగా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో ఖైదీలతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. క్షమాభిక్ష జీవోలు ఎప్పటికప్పుడు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. సత్ప్రవర్తన అలవర్చుకొని, బయటికి వెళ్లిన తర్వాత కుటుంబాలతో గౌరవంగా, ఆనందంగా గడపాలని హితవు పలికారు.

అప్పటి అభివృద్ధే..

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు అభివృద్ధి గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. గత పుష్కరాల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగానే సెంట్రల్‌ జైలును కూడా తీర్చిదిద్దారు. జైలు ఆవరణలో ఆస్పత్రి, కొత్త బ్లాకుల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు హూందాగా కనిపిస్తున్న సెంట్రల్‌ జైలు ఆనాటి అభివృద్ధిలో భాగమే.

ఆవేదన చెప్పుకొందామని..

కొన్ని కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించకపోవడంతో 15 ఏళ్లకు పైబడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నవాళ్లు, రెమిషన్‌తో కలుపుకొని 20 ఏళ్లు దాటిపోయిన ఖైదీలు కూడా ఉన్నారు. క్షణికావేశంలో లేదా ప్రేరేపితంగా నేరానికి పాల్పడిన వారిపై దయ చూపడం లేదని ఖైదీల కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా తమ ఆర్థిక, కుటుంబ పరిస్థితులు, ఖైదీ సత్ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతున్నారు. ఈ ప్రభుత్వం హయాంలో పర్లో, పరోల్‌ కూడా సరిగా రాక కుంగిపోతున్నామని చెబుతున్నారు. ఇదంతా చంద్రబాబుకు విన్నవించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

చివరగా 2021లో..

చంద్రబాబు హయాంలో నాలుగుసార్లు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో చాలామంది జీవిత ఖైదీలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ప్రస్తుత ం సెంట్రల్‌ జైలులో 1800 మంది రిమాండ్‌ తదితర కేటగిరీల ఖై దీలు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 20 21లో క్షమాభిక్ష ఇచ్చారు. తర్వాత జైలు అధికారుల నుంచి నివేదిక హైపవర్‌ కమిటీకి వెళ్లడం, దానిని ప్రభుత్వం పక్కన పెట్టడం జరుగుతోంది. దీంతో క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు ఆవేదనలో మునిగిపోతున్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదిస్తారని, ఇంటికి వెళ్తామని ఆనందపడ్డారు. కానీ, సీఎం జగన్‌ ఆ ఆనందాన్ని ఆవిరి చేశారు. జీవో ఇవ్వలేదు. వచ్చే నెల గాంధీ జయంతి సందర్భంగా అయినా క్షమాభిక్ష ప్రసాదిస్తారో లేదో తెలియదు. వైసీపీ ప్రభుత్వంలో ఇదే చివరి అవకాశం. గాంధీ జయంతికీ క్షమాభిక్ష పెట్టకపోతే.. తర్వాత ఎన్నికలు వచ్చేస్తాయి. అనంతరం రెండేళ్ల వరకూ తమను పట్టించుకే నాథుడే ఉండడనే ఆలోచన ఖైదీల మనసును తొలిచేస్తోంది.

ఏడాదికి మూడుసార్లు విడుదల చేయాల్సిందే..

జీవిత ఖైదుపడిన వాళ్లు కాకుండా ఇతర శిక్ష లు పడిన వాళ్లకు కూడా క్షమాభిక్ష అవకాశం కల్పించాలని.. సమయాలను నిర్దేశిస్తూ క్షమాభిక్షపై ఒక స్పష్టమైన విధివిధానాలు ఉండాల్సిందేనంటూ సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. దీనికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలూ నడుచుకోవాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 16న జీవో ఎంఎస్‌ నంబరు 58ని జారీ చేసింది. దీంతో జూన్‌లో 36 మంది విడుదలయ్యారు. అయితే, ఇది తాము చేసిన మేలుగా వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. వాస్తవానికి నిబంధనలను అనుసరించి ఏడాదికి మూడుసార్లు ఖైదీలను విడుదల చేయాల్సిందే. మొదటి ఫేజుకు జూన్‌ 1, రెండో ఫేజుకు అక్టోబరు 1, మూడో ఫేజుకు ఫిబ్రవరి 1 కట్‌ ఆఫ్‌ తేదీలుగా జీవోలో పేర్కొన్నారు. నాలుగు దశల్లో ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫేజ్‌ 1లో భాగంగా జనవరి 1 నుంచి 15వ తేదీలోపుగా, ఫేజ్‌ 2లో మే 1 నుంచి 15వ తేదీలోగా, ఫేజ్‌ 3లో సెప్టెంబరు 1 నుంచి 15వ తేదీలోగా అర్హులైన ఖైదీలను గుర్తించాల్సి ఉంటుంది. ఆపై జైలు అధికారులు మూడు నెలల్లోగా సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకోవాలి. జైలు అధికారులు ప్రిజన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌కి సిఫారసు చేసిన తర్వాత మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందాలి. అనంతరం మూడు నెలల్లో ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంటుంది. అంటే ఫేజ్‌ 1కి అక్టోబరు 1, ఫేజ్‌2కి ఫిబ్రవరి 1, ఫేజ్‌3కి జూన్‌ 1లోగా ప్రభుత్వం జీవో విడుదల చేయాలి.

Updated Date - 2023-09-13T11:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising