ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajahmundry Jail: సెలువుపై రాహుల్! సాగనంపారా? లేదంటే ఒత్తిడా?

ABN, First Publish Date - 2023-09-15T03:55:56+05:30

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్న రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ నాలుగు రోజులు సెలవుపై వెళుతున్నారు. శుక్రవారం నుంచి 18వ తేదీ వరకూ ఆయన సెలవులో

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్న రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ నాలుగు రోజులు సెలవుపై వెళుతున్నారు. శుక్రవారం నుంచి 18వ తేదీ వరకూ ఆయన సెలవులో ఉంటారు. ఆయన భార్యకు అనారోగ్యం కారణంగా దగ్గర ఉండి చూసుకోవాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెలవు పెట్టారని ఉన్నతాధికారులు వివరించారు. ఆ నాలుగు రోజులూ జైళ్ల శాఖ కోస్తాంధ్ర ప్రాంత డీఐజీ రవికిరణ్‌ జైలు పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటారు. రాహుల్‌ సెలవుపై వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబును జైలుకు తీసుకువచ్చిన నాటి నుంచే... రాహుల్‌కు నోటీసు ఇచ్చారని ఒకరోజు, బదిలీ చేశారని, సస్పెండ్‌ చేశారనే వ్యాఖ్యలు మరోరోజు వినిపించాయి. చంద్రబాబుతో ములాఖత్‌ తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి కూడా భద్రతపై అనుమానం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 12వ తేదీ రాత్రి జైలులో డీఐజీ రవికిరణ్‌ తనిఖీలు చేపట్టారు. 13న మరోమారు ఎస్పీ జగదీశ్‌తో కలిసి చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రాహుల్‌ సెలవు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే నెలలో సూపరింటెండెంట్‌ రాజారావును ఆకస్మికంగా అటాచ్‌మెంట్‌పై పంపేస్తూ డీజీ ఆదేశాలు జారీ చేయడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు.

మేలో విశాఖ నుంచి రాజమహేంద్రికి

మే 2న జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసును పరామర్శించడానికి చంద్రబాబు వచ్చారు. ములాఖత్‌ విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా అధికారులు వ్యవహరించారని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నతాధికారులు అప్పటి సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావును ఆకస్మికంగా బదిలీచేస్తూ అదే నెల 4న ఉత్తర్వులిచ్చారు. విశాఖపట్నం కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారిగా పనిచేస్తున్న ఎస్‌.రాహుల్‌ను సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌గా నియమించారు. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భార్యకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా ఉన్నతాధికారులు వినిపించుకోలేదు. దీంతో ఆయన వెంటనే రాజమహేంద్రవరం వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు భార్యకు అనారోగ్యం, మరోవైపు అటాచ్‌మెంట్‌పై విధులు నిర్వర్తించడం, ఈలోపు చంద్రబాబు అంశం వల్ల ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలుస్తోంది.

Updated Date - 2023-09-15T11:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising