ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchennaidu : ఓటర్ల జాబితాలో అక్రమాలు.. అచ్చెన్నాయుడు రాసిన లేఖపై స్పందించిన ఈసీ

ABN, First Publish Date - 2023-10-07T09:50:40+05:30

ప్రకాశం జిల్లా పర్చూరు, నెల్లూరు జిల్లా కావలిలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖపై కమిషన్ స్పందించింది. తీసుకున్న చర్యలపై అచ్చెన్నాయుడుకి చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారు.

అమరావతి : ప్రకాశం జిల్లా పర్చూరు, నెల్లూరు జిల్లా కావలిలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖపై కమిషన్ స్పందించింది. తీసుకున్న చర్యలపై అచ్చెన్నాయుడుకి చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారు. పర్చూరులో వేరే వ్యక్తుల పేర్లపై ఆన్‌లైన్‌లో ఫామ్-7 లు పంపిన 12 మంది పై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఇప్పటికే పర్చూరు ఈఆర్వో పిర్యాదు చేశారని లేఖలో కమిషన్ పేర్కొంది. బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారని మీనా పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం నకిలీ ఫామ్-7 లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకున్నట్టు మీనా పేర్కొన్నారు. కావలి నియోజకవర్గంలో అక్రమాలపై అచ్చెన్నాయుడు రాసిన లేఖపై కూడా కమిషన్ స్పందించింది. కావలిలో కూడా బల్క్ గా ఫామ్-7 లు ఇచ్చి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని పేర్కొంటూ లేఖ రాశారు. కావలిలో అక్రమాలపై విచారణకు ఆదేశించినట్లు కమిషన్ పేర్కొన్నారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు లేఖలో సీఈవో మీనా వివరించారు.

Updated Date - 2023-10-07T09:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising