ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahayagnam: శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగింపు... అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్

ABN, First Publish Date - 2023-05-17T10:56:03+05:30

నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం (Srilaxmi Mahayagnam) ముగిసింది. మహాయజ్ఞం ముగింపులో భాగంగా ఈరోజు అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి (Swarupanandendra Swamy) ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి ముగిసింది. పాంచరాత్ర యాగశాలలో పూర్ణాహుతికి వెళ్తూ మార్గ మధ్యలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పాదాలను జగన్ మొక్కారు. సీఎం వెంట వచ్చిన భద్రతా సిబ్బంది అంతా యాగశాలలోకి నీలం రంగు పంచెలతో ప్రవేశించారు.

కాగా... ఏపీ అభివృద్ధి చెందాలని కోరుతూ ఈనెల 12 నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ప్రారంభమైంది. మహాయజ్ఞం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు ముఖ్యమంత్రి జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న తర్వాత మహాయజ్ఞం మొదలైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్.. కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో సీఎం పాల్గొన్నారు. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు నిర్వహించారు. వారం రోజుల పాటు ఎంతో వైభంగా యజ్ఞం జరిగింది. మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు జరిగాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు..తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు యజ్ఞం కొనసాగింది. యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు జరిగాయి.

Updated Date - 2023-05-17T10:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising