ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Polavaram : పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

ABN, First Publish Date - 2023-07-20T08:35:21+05:30

పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. పెద్దమొత్తంలో వరద ఉధృతి పోలవరానికి వచ్చి చేరుతోంది. గంట గంటకు గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 30.680 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 3,15,791 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసింది

ఏలూరు : పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. పెద్దమొత్తంలో వరద ఉధృతి పోలవరానికి వచ్చి చేరుతోంది. గంట గంటకు గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 30.680 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 3,15,791 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసింది. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

తూర్పుగోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదుల నుంచి గోదావరిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 9 .20 అడుగులకు చేరుకుంది. 175 గేట్లను అధికారులు స్వల్పంగా ఎత్తివేశారు. 4.20 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి 39.10 అడుగులకు చేరుకుంది. నీటి ప్రవాహం 7,66,842 క్యూ‌సెక్కులకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.

Updated Date - 2023-07-20T08:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising