ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nageshwarrao: ఏపీలో పరిస్థితులపై సీబీఐ మాజీ డైరెక్టర్ సెటైర్

ABN, First Publish Date - 2023-09-23T09:52:25+05:30

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు.

న్యూఢిల్లీ: టీడీపీ చీఫ్ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో (Chandrababu Arrest) ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అటు ఏపీ అసెంబ్లీలోనూ చంద్రబాబు అరెస్ట్ అంశం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఇప్పుడు తాజాగా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు (Former CBI Director Nageshwarrao) స్పందించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు. ‘‘సంసారులపై బురద చల్లడానికి వ్యభిచారులు ఎల్లప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. అది లైంగిక వ్యభిచారులైనా లేక రాజకీయ వ్యభిచారులైనా!’’ అంటూ నాగేశ్వర్ రావు చేసిన ట్వీట్‌పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


మరోవైపు స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో విచారణ నిమిత్తం రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు చంద్రబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. చంద్రబాబును విచారించేందుకు ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరినప్పటికీ కేవలం రెండు రోజులు కస్టడీకి మాత్రమే ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రాజమండ్రి జైలులోని ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు.

Updated Date - 2023-09-23T09:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising