Devineni Uma: మట్టి అక్రమరవాణాపై దేవినేని ఆగ్రహం
ABN, First Publish Date - 2023-11-13T14:59:48+05:30
జిల్లాలో మట్టి అక్రమ రవాణాపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలో మట్టి అక్రమ రవాణాపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Devineni Umamaheshwar Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని మైలవరం పోలీస్‌స్టేషన్‌లో నాయకులతో కలిసి దేవినేని ఉమా ఫిర్యాదు చేశారు. పుల్లూరు గ్రామంలో రెండు రోజుల క్రితం గ్రామస్థులు మట్టి లారీలను పట్టించినా పోలీసులు వదిలి వేయడంపై దేవినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులతో కలిసి అక్రమంగా మట్టిని అమ్ముకునే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న అక్రమ దందాలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపించారు. మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, అనుచరులు చేస్తున్న అక్రమ దందాలను రోజుకు ఒకటి బయట పెడతానని సవాల్ చేశారు. పోలీసుల తీరుపైనా దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Updated Date - 2023-11-13T14:59:49+05:30 IST