ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP High Court: మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

ABN, First Publish Date - 2023-02-21T17:13:25+05:30

మాజీమంత్రి నారాయణ (Former Minister Narayana)కు హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ (CID) కేసులో నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీమంత్రి నారాయణ (Former Minister Narayana)కు హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ (CID) కేసులో నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు (High Court) మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలపై నారాయణపై 2020లో సీఐడీ కేసు నమోదు చేసింది. నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. 41ఏ నిబంధనలు అనుసరించాలని సీఐడీ పోలీసులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ 3 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ (Inner Ring Road) అలైన్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ నారాయణపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. 2019 నాటికి సీన్‌ మారింది వైసీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చింది. కక్ష సాధింపే లక్ష్యంగా వైసీపీ పాలకులు పావులు కదపడం ప్రారంభించారు. ప్రతిపక్ష నాయకులపై రకరకాల కేసులు పెట్టి వేధింపులకు దిగారు. అందులో భాగంగా అమరావతి రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించి నమోదు చేశారు. ఇదంతా ఆగమేఘాలపై జరిగిపోయింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు (Chandrababu)ను, ఏ2గా మంత్రి నారాయణను చేర్చారు. అప్పటి చంద్రబాబు, నారాయణ న్యాయపోరాటం సాగిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామంలో 2001 నవంబరు 2న పి.నారాయణ తన భార్య రమాదేవి పేరుతో 40 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. అప్పుడు మనది ఉమ్మడి రాష్ట్రం. ఆర్థిక సంస్కరణలు ముమ్మరంగా అమలవుతూ రాజకీయ నినాదాలు, ప్రత్యేక డిమాండ్‌లు అసలే వినిపించని కాలమది. కట్‌ చేస్తే.. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధానిగా ప్రకటించి పరిపాలన మొదలుపెట్టింది. ఆ సమయంలో విజయవాడ చుట్టుపక్కల భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న పోరంకి వంటి గ్రామాల్లో నారాయణ వంటి వారి భూములు ఎకరం రూ.30 నుంచి 40 కోట్ల వరకు వెళ్లింది.

రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీయే)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మున్సిపల్‌ శాఖ ఆధీనంలో పనిచేసేది. నారాయణ ఆ శాఖ మంత్రి. రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును (ఐఆర్‌ఆర్‌) నిర్మించాలన్న ప్రతిపాదనను సీఆర్డీయే తెరపైకి తెచ్చింది. గుంటూరు జిల్లాలో 17 గ్రామాలు, కృష్ణాజిల్లాలో 24 గ్రామాల మీదుగా ఐఆర్‌ఆర్‌ వెళ్లే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముసాయిదా ఐఆర్‌ఆర్‌ను 97.5 కి.మీ. పొడవు, 75 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించారు. దీనికి 2017 ఫిబ్రవరి 8న సీఆర్డీయే సమావేశంలో ఆమోదం తెలిపారు. రైతులు, స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో వారి అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకుని 96.25 కిలోమీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రివైజ్డ్‌ ఐఆర్‌ఆర్‌ను ప్రతిపాదించారు. దీంతోపాటు ఐఆర్‌ఆర్‌ నుంచి రాజధానికి అనుసంధానించిన 27 రహదారులను 87.19 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలన్న ప్రతిపాదనను చేర్చారు. 2018 అక్టోబరు 31న గెజిట్‌ను వెలువరించారు.

Updated Date - 2023-02-21T17:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising