Chandrababu Arrest: కొనకళ్ల నారాయణ హౌస్ అరెస్ట్.. జగన్ పతనం ప్రారంభం అన్న మాజీ ఎంపీ
ABN, First Publish Date - 2023-09-09T09:23:18+05:30
మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను పోలీసులు గృహ నిర్భందం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆందోళనకు సిద్ధమైన మాజీ ఎంపీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా: మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను (Former MP Konakalla Narayana) పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అరెస్ట్ నేపథ్యంలో ఆందోళనకు సిద్ధమైన మాజీ ఎంపీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై కొనకళ్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. జగన్ (AP CM YS Jagan mohan reddy) కళ్లలో ఆనందం కోసమే చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. సంబంధం లేని కేసుల్లో చంద్రబాబును ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాలు ఉన్నాయి కాబట్టే గతంలో జగన్‌ను అరెస్ట్ చేశారని తెలిపారు. చంద్రబాబుపై గతంలో వైఎస్ కేసులు పెట్టారని.. ఇప్పుడు జగన్ పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ పతనం ప్రారంభమైందన్నారు. పోలీసులు జగన్ చేతిలో కీలు బొమ్మలుగా మారారు అంటూ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Updated Date - 2023-09-09T09:23:19+05:30 IST