ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: టీటీడీకి రూ.18కోట్ల విలువైన 10 విద్యుత్ బస్సుల కానుక

ABN, First Publish Date - 2023-03-27T20:24:48+05:30

తిరుమల (Tirumala)లో భక్తులను ఉచితంగా రవాణా చేసేందుకు 10 విద్యుత్‌ బస్సులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) సోమవారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుమల: తిరుమల (Tirumala)లో భక్తులను ఉచితంగా రవాణా చేసేందుకు 10 విద్యుత్‌ బస్సులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) సోమవారం ప్రారంభించారు. ఒలెక్ట్రా సంస్థకు చెందిన రూ.18 కోట్ల విలువైన ఈ విద్యుత్‌ బస్సులను హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ (Megha Engineering Company) టీటీడీకి విరాళంగా అందజేసింది. తిరుమలలో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి డీజల్‌ వాహనాల స్థానంలో దశలవారీగా విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టాలని టీటీడీ (TTD) నిర్ణయించిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మొదటిదశలో తిరుమలలో అధికారులకు 35 విద్యుత్‌ కార్లను ఇచ్చామన్నారు. ఆర్టీసీ తిరుమల-తిరుపతి మధ్య 65 విద్యుత్‌ బస్సులు నడుపుతోందన్నారు. తిరుమలలోని వర్క్‌షాప్‌లో విద్యుత్‌ బస్సుల కోసం ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ బస్సులు నడిపేందుకు టీటీడీ డైవర్లకు ఒలెక్ర్టా సంస్థ శిక్షణ ఇస్తుందని, ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం తదితరులు విద్యుత్‌ బస్సుల్లో ప్రయాణించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఒలెక్ట్రా సంస్థ సీఎండీ ప్రదీప్‌, టీటీడీ సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, డీఐ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-27T20:24:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising