ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP HighCourt: ప్రభుత్వ జీవోలు జీవోఐఆర్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో విచారణ

ABN, Publish Date - Dec 27 , 2023 | 04:42 PM

Andhrapradesh: ప్రభుత్వ జీవోలను జీవోఐఆర్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాజ్యాంగ పరమైన అంశాలు ఇమిడి ఉండటంతో లోతుగా విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది. జీవోలకు సంబంధించిన తీర్పులను మెమో రూపంలో వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీఈ గెజిట్‌లో ఐదు శాతం మాత్రమే జీవోలను పెడుతున్నారని న్యాయవాది ఉమేష్ చంద్ర తెలిపారు.

అమరావతి: ప్రభుత్వ జీవోలను జీవోఐఆర్‌లో (GOIR) పెట్టకపోవడంపై హైకోర్టులో (AP HighCourt) దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాజ్యాంగ పరమైన అంశాలు ఇమిడి ఉండటంతో లోతుగా విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది. జీవోలకు సంబంధించిన తీర్పులను మెమో రూపంలో వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీఈ గెజిట్‌లో ఐదు శాతం మాత్రమే జీవోలను పెడుతున్నారని న్యాయవాది ఉమేష్ చంద్ర తెలిపారు. ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసి జీవోలను తీసుకోమనండ సరికాదని న్యాయవాది అన్నారు. ఆర్టీఐ, రాజ్యాంగ స్పూర్తికి కూడా విరుద్ధంగా జీవోల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని న్యాయవాది శ్రీకాంత్ వెల్లడించారు. జీవోలను వివిధ కేటగిరీల్లో విభజించి దేనిని కూడా వెబ్ సైట్‌లో ఉంచడం లేదని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ చెప్పారు. ప్రభుత్వం ఆర్టీఐ చట్టానికి విరుద్దంగా వ్యవహరిస్తుందని, అసలు జీవోలు పెడితే కదా తమకు తెలిసేది అని మరో న్యాయవాది యలమంజుల బాలాజీ ప్రశ్నించారు. తాము అన్ని జీవోలను గెజిట్‌లో ఉంచుతున్నామని ప్రభుత్వ న్యాయవాది సుమన్ చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కేసును లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Dec 27 , 2023 | 04:42 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising