ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu : చంద్రబాబు కోనసీమ పర్యటనతో ప్రభుత్వం అలెర్ట్

ABN, First Publish Date - 2023-05-04T14:06:13+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ పర్యటనతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. తడిచిన ధాన్యం.. మునిగిన పొలాలను యుద్ధ ప్రాతిపాదికన మంత్రి వేణు, అధికారులు పరిశీలిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ : టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ పర్యటనతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. తడిచిన ధాన్యం.. మునిగిన పొలాలను యుద్ధ ప్రాతిపాదికన మంత్రి వేణు, అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంతవరకూ అధికారులు రైతుల ముఖం చూసింది లేదు కానీ చంద్రబాబు వస్తున్నారనగానే మాత్రం హుటాహుటిన పొలాల పరిశీలనకు వెళ్లిరారు. చంద్రబాబు పర్యటన ఉండడంతో రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు చంద్రబాబు పర్యటించనున్న వేగాయమ్మ పేటలో అధికారులు ముందుగానే పర్యటిస్తూ.. రైతులను ఆదుకుంటామని రోడ్డెక్కవద్దని వారిపై ఒత్తిడి తెస్తున్నారు.

ఇప్పటికే దాదాపు 25 వేలకు పైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యం అకాల వర్షాలకు దెబ్బతింది. వందలాది మంది రైతులు నష్టాల పాలయ్యారు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు గాని పరామర్శించిన పాపాన పోలేదు. జిల్లా స్థాయి అధికారులు ఆ వైపు చూడనే చూడలేదు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉమ్మడి పశ్చిమలో రైతులు విలవిలలాడిపోయారు. ఈ తరుణంలోనే చంద్రబాబు నీట మునిగిన పంట పొలాల పరిశీలనకు వెళ్లనున్నారు. తడిసి ముద్దయిన వరి పొలాలను సందర్శించి. రైతులతో నేరుగా భేటీ అవుతారు. ఈ మేరకు తెలుగుదేశం కార్యాచరణ ప్రకటించింది. ఉమ్మడి పశ్చిమలో చంద్రబాబు పర్యటనకు రైతులంతా సంఘీభావం ప్రకటించేలా కార్యచరణ సిద్ధం చేశారు.

Updated Date - 2023-05-04T14:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising