AP News : వైసీపీ ఎమ్మెల్యేపై వలంటీర్ ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..?
ABN, First Publish Date - 2023-08-28T17:50:18+05:30
‘గడప గడపకు’ కార్యక్రమం సందర్భంగా తనను ఎమ్మెల్యే బెదిరించారని వలంటీర్, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
గుంటూరు : పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో (Kilari Rosaiah) తనకు ప్రాణహాని ఉందంటూ గ్రామ వలంటీర్ (Grama Volunteer) ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ‘గడప గడపకు’ కార్యక్రమం సందర్భంగా రోశయ్య తనను బెదిరించారని వలంటీర్, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్తివివరాల్లోకెళితే.. ఇటీవల జరిగిన గడప గడపకు కార్యక్రమంలో వలంటీర్ రవితేజ పాల్గొన్నాడు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. వలంటీర్.. రావి వెంకటరమణకు అనుకూలంగా ఉన్నాడని ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆందోళన చెందిన వలంటీర్, కుటుంబ సభ్యులు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
వలంటీర్ ఏమంటున్నాడంటే..?
ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన రవితేజ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. వైసీపీ గెలుపుకోసం 2019 ఎన్నికల్లో తాను ఎంతో కష్టపడి పనిచేశానని.. వలంటీర్ చెప్పుకొచ్చాడు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోశయ్య అవినీతికి పాల్పడుతున్నారని రవితేజ ఆరోపించాడు. సమస్యపై ఆయన వద్దకు వెళ్తే ఇష్టమొచ్చినట్లుగా తిడుతున్నారని మండిపడ్డాడు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని ఎస్పీని విన్నవించుకున్నాడు. అయితే ఎమ్మెల్యేపైనే ఫిర్యాదు చేయడంతో.. రోశయ్యను కాదని పోలీసులు చర్యలు తీసుకుంటారా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక పోలీసులు వలంటీర్‌కు ఏవిధమైన రక్షణ కల్పిస్తారో చూడాలి.
Updated Date - 2023-08-28T17:52:03+05:30 IST