ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh YuvaGalam: గుంటూరులో కొనసాగుతున్న లోకేశ్ యువగళం.. నేటి షెడ్యూల్ ఇదే..

ABN, First Publish Date - 2023-08-14T10:43:29+05:30

జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.

గుంటూరు: జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్రకు (YuvaGalam Padayatra) విశేష స్పందన లభిస్తోంది. లోకేశ్ పాదయాత్ర జరిగే ప్రాంతానికి చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా ప్రతీఒక్కరూ పెద్దఎత్తున చేరుకుని యువనేతకు ఘన స్వాగతం పలుకుతున్నారు. లోకేశ్‌తో పాదయాత్ర చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యలను లోకేశ్‌కు విన్నవిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు తీరుస్తామని హామీ ఇస్తూ లోకేశ్ ముందుకు సాగుతున్నారు. ఈరోజు (సోమవారం) జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో యవగళం పాదయాత్ర కొనసాగుతోంది. నేడు రావెల శివారు క్యాంప్ సైట్ నుంచి 184వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. మధ్యాహ్నం తాడికొండ శివారు విడిది కేంద్రం వద్ద ఆడిటర్లతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు. యువనేత ఇప్పటి వరకు 2453.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు 11.3 కిలోమీటర్లు నడవనున్నారు.


నేటి పాదయాత్ర షెడ్యూల్...

ఉదయం

  • 8:00 – రావెల శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

  • 10:00 – పొన్నెకల్లులో ముస్లిం సామాజికవర్గీయులతో సమావేశం.

  • 11:00 – తాడికొండ అడ్డరోడ్డులో స్థానికులతో సమావేశం.

  • 11:45 – తాడికొండ శివార్లలో ఆడిటర్లతో ముఖాముఖి.

  • 12:45 – తాడికొండ శివార్లలో భోజన విరామం.

సాయంత్రం

  • 4:00 – తాడికొండ శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.

  • 5:00 – తాడికొండ ఎన్టీఆర్ సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.

  • 8:00 – కంతేరులో స్థానికులతో సమావేశం.

  • 9:30 – నిడమర్రు శివారు విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-08-14T10:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising