ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Assembly: ఓపీఎస్‌పై ఆర్థికమంత్రి బుగ్గన ఏం మాట్లాడారంటే..!

ABN, First Publish Date - 2023-09-27T15:33:40+05:30

భవిష్యత్‌లో వైద్యం మరింత అభివృద్ధి చెంది జీవిత కాలం పెరుగుతుంది. జీవితకాలం పెరగడంతో పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వాలకు భారంగా మారనుంది. అమెరికాలో కూడా ఓపీఎస్‌ భారంగా మారడంతో అక్కడి రాష్ట్రాలు ప్రత్యమ్నాయం కోసం

అమరావతి: ఏపీ అసెంబ్లీలో టేబుల్ అజెండా ఐటెంగా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (Buggana Rajendranath Reddy) ప్రవేశ పెట్టారు. అసెంబ్లీలో జీపీఎస్ సిస్టమ్ బిల్లు 2023ను మంత్రి ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘‘సీపీఎస్‌ను సమీక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు, అధికారులు కమిటీ జీపీఎస్‌ను రూపొందించింది. ఉద్యోగులతో చర్చించి గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను ఓ హైబ్రీడ్ మోడల్‌గా కేబినెట్‌ ఆమోదించింది. ఉద్యోగులు ప్రభుత్వంలో ముఖ్యమైన భాగం. ప్రభుత్వాన్ని కాపాడుకోవటంలో ఉద్యోగులు కీలకంగా నిలవాలి. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను చట్టంగా రూపొందించేందుకే శాసనసభలో ప్రవేశపెట్టాం.’’ అని మంత్రి బుగ్గన తెలిపారు.

ఓపీఎస్‌పై ఏపీ అసెంబ్లీలో బుగ్గన భవిష్యత్‌ పాఠాలు..

‘‘భవిష్యత్‌లో వైద్యం మరింత అభివృద్ధి చెంది జీవిత కాలం పెరుగుతుంది. జీవితకాలం పెరగడంతో పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వాలకు భారంగా మారనుంది. అమెరికాలో కూడా ఓపీఎస్‌ భారంగా మారడంతో అక్కడి రాష్ట్రాలు ప్రత్యమ్నాయం కోసం చూస్తున్నాయి. భావితరాల గురించి మర్చిపోతే ఓపీఎస్‌ అంటే వచ్చే పదేళ్లు బాగానే ఉంటుంది. పదేళ్ల తరువాత ఓపీఎస్‌ కాదు.. వేతనాలు కూడా ఇవ్వలేం. పెన్షన్ అనేది ఇన్ ఎలాస్టిక్ దాన్ని మార్చలేము. సీపీఎస్‌కు ఇవాళ ఎంత అవుతుందో అంతకు నాలుగున్నర రెట్లు.. ఎక్కువ భవిష్యత్‌లో అవుతుంది అనే రిపోర్టు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని రాష్ట్రాలు నోటిఫికేషన్లు ఇచ్చాయి.’’ అని బుగ్గన పేర్కొన్నారు.

Updated Date - 2023-09-27T15:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising