ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Governor: వ్యవసాయం దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగం..

ABN, First Publish Date - 2023-05-22T15:22:42+05:30

వ్యవసాయం మన దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వ్యవసాయ యూనివర్శిటీని సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల జిల్లా: వ్యవసాయం మన దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగమని ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) గవర్నర్ (Governor) అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వ్యవసాయ యూనివర్శిటీని (Agricultural University) సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2030 నాటికల్లా ఆహార భద్రత సాధించాలని ఐక్యరాజ్యసమితి సూచించిందని, ఇందులో చిరు ధాన్యాల ఉత్పత్తి పెంచటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు ఇబ్బంది ఉన్నా.. చిరు ధాన్యాల సాగులో మంచి దిగుబడి వస్తుందన్నారు. చిరు ధాన్యాల్లో నూతన వంగడాలు ఆవిష్కరణకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

వ్యవసాయంలో 17 రకాల నూతన వంగడాలను 2021లో ఆవిష్కరించటం శుభ పరిణామమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శాస్త్రవేత్తలు రైతులతో నిత్యం అనుసంధానం కావటం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. డ్రోన్ శిక్షణలో డిజిసిఏ అనుమతి సాధించిన వ్యవసాయ యూనివర్సిటీకి అభినందనలు తెలిపారు. వ్యవసాయం మాత్రమే అన్ని వేలలా సంపద సృష్టికి తోడ్పటుతుందని, వ్యవసాయ విద్యలో మరిన్ని మార్పులు రావాలని ఆయన ఆకాంక్షించారు. క్షేత్ర పర్యటనలు, సాంకేతికత వినియోగం, సరికొత్త ఆలోచనలు పెంపొందించేలా విద్య ఉండాలన్నారు. జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని.. ‘మీ కలల్ని సాధించడం మీతోనే సాధ్యం.. మీ లక్ష్యం చేరుకునేందుకు మీరు మాత్రమే కృషి చేయాల్సి ఉంటుంది’ అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-22T15:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising