ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ambati Rambabu: విద్యార్థులంతా క్షేమం.. సత్తెనపల్లి ఘటనపై అంబటి

ABN, First Publish Date - 2023-01-31T11:30:51+05:30

జిల్లాలోని సత్తెనపల్లిలో విద్యార్థినిలకు ఫుడ్పాయిజన్ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో విద్యార్థినిలకు ఫుడ్‌పాయిజన్ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు (AP Minister Amabati Rambabu) స్పందించారు. మంగళవారం ఉదయం జీజీహెచ్‌ (GGH)లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంత్రి అంబటి (AP Minister), ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ (MLC Dokka Manikya Varaprasad) పరామర్శించారు.

అనంతరం అంబటి (Amabati Rambabu)మీడియాతో మాట్లాడుతూ... విద్యార్థినిలందరికీ వైద్యం అందించామని... ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. 94 మంది సత్తెనపల్లి ఆసుపత్రి (Sattenapalli Government Hospital)లో, ఏడుగురు విద్యార్థినులు గుంటూరు జీజీహెచ్‌ (Guntur GGH)లో చికిత్స పొందుతున్నారన్నారు. అందరూ విద్యార్థినిలు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్‌ నియమించిన కమిటీ విచారణ ప్రారంభించిందని తెలిపారు. అజాగ్రత్తగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయని... ఈ ఘటనకు బాధ్యులైన ఎవరిని ఉపేక్షించమని హెచ్చరించారు. దుర్ఘటనలను రాజకీయ అవకాశంగా మార్చుకునే వాళ్ళను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘‘నా మీద బురద జల్లే వాళ్ళే ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ గురించి నేనేమీ మాట్లాడను’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ... ఫుడ్‌పాయిజన్ ఘటనపై విచారణ జరుగుతోందని... బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్నారన్నారు. పిల్లల ఆహారం పట్ల కూడా సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. పేదలకు మంచి విద్యను అందించాలన్నదే సీఎం జగన్ ధ్యేయం అని స్పష్టం చేశారు.

ఏం జరిగిందంటే...

సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ జరగడంతో 130 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో ఇబ్బందులుపడ్డారు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినిలను సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెనువెంటనే విద్యార్థినిలకు వైద్యం చేసిన డాక్టర్లు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

ఐదుగురు సభ్యులతో విచారణ...

బాలికల గురుకుల పాఠశాల పుడ్ పాయిజన్‌పై కలెక్టర్ (Collector) స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆహారం విషపూరితంపై అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆహరం, తాగునీటి శాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపించారు. కాగా... చికెన్ తిని విద్యార్థులు అస్వస్థత గురైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో గురుకుల పాఠశాలకు అధికారులు ఒకరోజు సెలవు ప్రకటించారు.

Updated Date - 2023-01-31T11:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising