KA Paul: జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరే విషయంపై కేఏ పాల్ క్లారిటీ
ABN, First Publish Date - 2023-04-26T20:35:39+05:30
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) తమ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (ka paul) తెలిపారు.
గుంటూరు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) తమ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (ka paul) తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ (YCP), టీడీపీ (TDP) ఒకరిపై ఒకరు విమర్శలకే పరిమితమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా (Telangana)లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని మండిపడ్డారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నానని వెల్లడించారు. ప్రధాని మోదీ (PM Modi) ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఎలా ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో బీజేపీ (BJP)కి ప్రచారం చేస్తే తనను మోసం చేశారని ఆరోపించారు. ఏపీ (AP)కి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు.
కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ఆపాలని సవాల్ విసిరారు. ఏపీ హైకోర్టు (AP Highcourt)లో దీనిపై పిల్ దాఖలు చేశానని తెలిపారు. తన పిటిషన్ రేపు విచారణకు వస్తుందని భావిస్తున్నానని అన్నారు. పిల్ స్వీకరించకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కాపాడటానికి విదేశీ నిధులు అనుమతించాలని పిల్ వేశానన్నారు. గంగవరం పోర్టును కేంద్రం అతి తక్కువ ధరకు అమ్మేసిందని ఆయన పేర్కొన్నారు. జగన్ (CM Jagan) తన ఉనికి కోసం మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ (Pawankalyan)కు నిలకడ లేదన్నారు. పవన్ బీజేపీతో ఎందుకు కలిశారు? అని ప్రశ్నించారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం పవన్ వేచిచూడడం ఏంటి? అని ప్రశ్నించారు.
Updated Date - 2023-04-26T20:52:29+05:30 IST