YuvaGalam: లోకేశ్‌తో ముఖాముఖి.. ఏపీ సర్కార్ వేధింపులపై ఆడిటర్ల ఆవేదన..
ABN, First Publish Date - 2023-08-14T16:08:52+05:30
రాష్ట్ర ప్రభుత్వ వేధింపులపై ఆడిటర్లు టీడీపీ యువనేత నారా లోకేశ్ ముందు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ వేధింపులపై ఆడిటర్లు టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) ముందు తమ ఆవేదనను వెలిబుచ్చారు. సోమవారం యువగళం పాదయాత్రలో (YuvaGalam Padayatra) భాగంగా తాడికొండ వద్ద ఆడిటర్లతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా లోకేశ్ ముందు ఆడిటర్లు తమ బాధను చెప్పుకొచ్చారు. సీఐడీ ద్వారా ప్రభుత్వ వేధింపులను లోకేష్ దృష్టికి ఆడిటర్లు తీసుకొచ్చారు. చార్టెడ్ అకౌంటెంట్లపై ప్రభుత్వం కేసులు పెడుతోందన్నారు. సీఐడీ ద్వారా కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. ఆడిటర్లకు, చార్టెడ్ అకౌంటెంట్లకు సంబంధం లేని వ్యవహారాల్లో కేసులు పెట్టారన్నారు. రాజకీయ కక్షలతో అరెస్టులు చేశారని చెప్పారు. అరెస్టు విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని ఆడిటర్లు తెలిపారు.
లోకేశ్ మాట్లాడుతూ.. మార్గదర్శిపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు. ఖాతాదారులు ఫిర్యాదు లేకుండానే వేధించారని తెలిపారు. ఆరు దశాబ్దాలుగా ప్రజల నమ్మకం చూరగొన్న సంస్థ మార్గదర్శి అని.. ఆ సంస్థపై ఇప్పుడు వరకూ ఎలాంటి ఫిర్యాదు లేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని మార్గదర్శిపై కక్ష గట్టారన్నారు. రాజకీయాలు వేరు, వృత్తి వేరు.. కానీ వైసీపీ ప్రతిదీ రాజకీయంగా చూస్తోందని మండిపడ్డారు. ఇవన్నీ చూసి మార్గదర్శి వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడతాయా అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-08-14T16:08:52+05:30 IST