ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma: పేర్నినాని వచ్చేఎన్నికల్లో ఎందుకు పోటీచేయనంటున్నారో చెప్పాలి..

ABN, First Publish Date - 2023-04-03T14:46:54+05:30

విజయవాడ: ఎన్నికలు ఎప్పుడు జరిగినా, జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని మట్టికరిపించడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడ: ఎన్నికలు (Elections) ఎప్పుడు జరిగినా, జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy)ని, వైసీపీ (YCP)ని మట్టికరిపించడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Uma) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ గురించి మాట్లాడేముందు, పేర్నినాని (Perni Nani) వచ్చేఎన్నికల్లో ఎందుకు పోటీచేయనంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీ తరుపున బరిలో నిలిచే అభ్యర్థులెవరో చెప్పే దమ్ము, ధైర్యం పేర్నినానికి, సీఎం జగన్‌కు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

పేర్నినానికి డిపాజిట్లురావని గతంలోనే చెప్పానని.. నానికి దమ్ముంటే, సొల్లుపురాణాలు చెప్పడంమాని ప్రజాక్షేత్రంలో టీడీపీతో తేల్చుకోవాలని బోండా ఉమ సవాల్ చేశారు. డిపాజిట్లు (Deposits) దక్కవన్న భయంతోనే పేర్నినాని, ధర్మాన (Dharmana), చెవిరెడ్డి (Chevireddy)లాంటి వాళ్లు పోటీచేయమంటున్నారు. 87 శాతం హామీల అమలు సాక్షి మీడియాలోనే కనిపిస్తోందన్నారు. ప్రజలు జగన్‌ను, వైసీపీని విశ్వసించడం లేదని ఐప్యాక్ సర్వే తేల్చిందన్నారు. ఐప్యాక్ సర్వే చూశాక జగన్‌ను నమ్మి ఎన్నికల బరిలో నిలవడానికి ఎవరూ సాహసించడంలేదన్నారు. అవినీతి కేసులు, బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడటానికి జగన్ ఢిల్లీ పర్యటనలు (Delhi Tour) చేస్తున్నారని విమర్శించారు. 4 ఏళ్లల్లో అక్కచెల్లెమ్మల పుస్తెలుతెంపి, మద్యం అమ్మకాలతో 94 వేల కోట్లు రాబట్టడమేనా జగన్ అమలుచేసిన మద్యపాన నిషేధం? అంటూ బోండా ఉమ ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-04-03T14:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising