ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagan Govt: జగన్ సర్కార్ మరో ఘన కార్యాన్ని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టిన కేంద్రం !

ABN, First Publish Date - 2023-07-20T14:19:00+05:30

పెట్రోల్ ధరలపై (Petrol prices) పార్లమెంట్ సాక్షిగా కేంద్రం షాకింగ్ విషయం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యాట్‌ పన్నులకు అనుగుణంగా చమురు ధరలు ఉన్నాయని లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరి ఈ మేరకు లిఖితపూర్వకంగా పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు.

ఢిల్లీ: పెట్రోల్ ధరలపై (Petrol prices) పార్లమెంట్ సాక్షిగా కేంద్రం షాకింగ్ విషయం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే (AP) పెట్రోల్ ధర ఎక్కువగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యాట్‌ పన్నులకు అనుగుణంగా చమురు ధరలు ఉన్నాయని లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరి ఈ మేరకు లిఖితపూర్వకంగా పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు.

ఏపీలోని అమరావతి (Amaravati) కేంద్రంగా పరిగణించి పెట్రోల్‌, డీజిల్ ధరలను కేంద్రం సేకరించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. డీజిల్‌, పెట్రోలు ధరల్లో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ ‌అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. ఏపీలో పెట్రోల్‌ లీటరుకు రూ. 111.87, డీజిల్‌ రూ. 99.61గా ఉన్నట్లు పార్లమెంట్‌కు కేంద్రం నివేదించింది. డీజిల్‌ కూడా అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ ధర ఉందని తెలిపింది. పెట్రోల్‌ ధరల్లో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో ఉండగా.. డీజిల్‌ ధరల్లో రెండో స్థానంలో నిలిచింది. డీజిల్‌ ధరల్లో లక్షద్వీప్‌ మాత్రం తొలి స్థానంలో ఉందని కేంద్రం పేర్కొంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో చమురు ధరలు ఒకేలా ఉండే విధానం ఇప్పటివరకూ ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో మాత్రం పెట్రోల్‌ లీటరుకు రూ. 109.66, డీజిల్‌ రూ. 97.82 ఉన్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

Updated Date - 2023-07-20T14:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising