ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: మైనారిటీలను మోసం చేసిన జగన్ ప్రభుత్వం..

ABN, First Publish Date - 2023-04-26T15:54:10+05:30

చంద్రబాబు (Chandrababu) బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత సుభాని (Subhani) అకాల మరణానికి సంతాపం తెలుపుతూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత సుభాని (Subhani) అకాల మరణానికి సంతాపం తెలుపుతూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి మసీదుకు రిజిస్ట్రేషన్ చేయించాలని, కరెంట్ బిల్లులో సబ్సిడీ ఇవ్వాలనే విషయాన్ని తప్పకుండా పరిశీలనలోకి తీసుకొని హామీ నెరవేరుస్తానన్నారు. మైనారిటీలతో ప్రత్యేక సమావేశం చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం (Jagan Govt.) మైనారిటీలను మోసం చేసిందని విమర్శించారు.

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన ఘనత తమదేనని చంద్రబాబు అన్నారు. దుల్హన్ పథకం అమలు చేశామని, దీనిపై వైసీపీ నిబంధనలు పెట్టి.. దుల్హన్ పధకాన్ని నాశనం చేసిందన్నారు. రంజాన్ తోఫా ఇచ్చి పేద ముస్లింల ఇంట టీడీపీ వెలుగులు నింపామన్నారు. ఇప్పుడు ముస్లింలకు ఇవ్వాల్సిన పథకాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం పరిపాటయిందన్నారు. జగన్ అధికారంలోకి రాగానే సాక్షి పేపర్‌కు రూ. 1000 కోట్ల యాడ్స్ ఇచ్చారని ఆరోపించారు. గతంలో మసీదులు, ఈద్గాలు, మౌళనాలకు జీతాలు ఇచ్చామన్నారు. ఈ ప్రభుత్వం మైనారిటీ సోదరులపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. చూస్తూ ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు. ముస్లిం మైనారిటీలకు తన ప్రాణం అడ్డుపెట్టి కాపాడుతానన్నారు. జగన్ పోలీసులతో కేసులు పెట్టి పరిపాలన చేయాలని చూస్తున్నారని.. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఏపీలో టీడీపీ కార్యకర్తలు ప్రజలు బ్రతుకుతున్నారన్నారు.

ఎంపీ అవినాష్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఇంకా నిర్దోషిని అని అనడం విడ్డురంగా ఉందని చంద్రబాబు అన్నారు. మైనారిటీ యువతులు, మహిళలు, బాలికలు వైసీపీ వారి చేతులలో బలైపోయారని.. ఇన్ని రకాలుగా హత్యలు, మానభంగాలు చేస్తున్నా.. సీఎం చోద్యం చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. నంద్యాలలో మైనారిటీ కుటుంబ సభ్యులు నలుగురు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుందని, అంగన్‌వాడి వర్కర్ ఒంటరి మహిళను ఇబ్బందులు పెట్టి రాజద్రోహం కేసులు పెట్టారని, గురజాల, మాచర్లలో వంద కుటుంబాలు రక్షణ లేక గ్రామం వదలి వెళ్లిపోయారని అన్నారు. ఇసుక దండాపై పోరాటం చేస్తున్న కొమ్మలాపాటిపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీలో మతకలహాలు లేకుండా చేసిన ఘనత టీడీపీదేనన్నారు. ముస్లిం మైనారిటీలపై దాడులు చేసిన వారిపై ప్రత్యేక చట్టం తీసుకువచ్చి.. కఠిన చర్యలు ఉండేవిధంగా చేస్తానన్నారు. టీడీపీ హయాంలో మైనరిటీలను రాజకీయంగా అభివృద్ధి చేశామని.. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కావాలని పోరాటం చేశామన్నారు. ముస్లింలకు సబ్ ప్లాన్ అమలు చేసే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Updated Date - 2023-04-26T15:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising