ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు

ABN, First Publish Date - 2023-03-01T19:47:18+05:30

పల్నాడు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ (NTR Statue) ధ్వంసాన్ని టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తీవ్రంగా ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: పల్నాడు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ (NTR Statue) ధ్వంసాన్ని టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తీవ్రంగా ఖండించారు. మహనీయులను అవమానించే చర్యలు పరిపాటిగా మారాయని మండిపడ్డారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన బాధ్యులపై చర్యలు చేపట్టాలని ట్విట్టర్‌లో చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసానికి నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు హైవేపై ఆందోళన చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ విగ్రహంపై ఈ అమానుష ఘటన దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చకొట్టే కుట్రలో భాగంగానే ఈ దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వైసీపీ జడ్పీటీసీ యలమంచ ధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. అధికార వైసీపీ నాయకుల అండదండలతోనే దాడులు కొనసాగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. మహనీయుల విగ్రహాల ధ్వంసంపై శాంతియుత నిరసన తెలిపితే టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకుంటారా.. అని ప్రశ్నించారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని విధ్వంసక ఘటనలు పునరావృతం కాకుండా, ఫిర్యాదులపై విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానం ఉందని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2023-03-01T19:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!