Guntur Dist.: చంద్రన్న ఉగాది కానుకల పంపిణీ..
ABN, First Publish Date - 2023-03-22T11:35:52+05:30
గుంటూరు జిల్లా: ఉగాది (Ugadi) పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గుంటూరులో మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రన్న ఉగాది కానుకలు పంపిణీ చేశారు.
గుంటూరు జిల్లా: ఉగాది (Ugadi) పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గుంటూరు (Guntur)లో మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ (Mannava Mohan Krishna Charitable Trust) ఆధ్వర్యంలో చంద్రన్న (Chandranna) ఉగాది కానుకలు (Ugadi Gifts) పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ.. కృష్ణ దేవరాయ కాలనీలో నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలు అన్ని పండుగలు సంతోషంగా జరుపుకున్నారన్నారు. వైసీపీ (YCP) పాలనలో పేదలు పండగలు చేసుకోలేని దుస్దితి ఏర్పడిందన్నారు. అందుకే చంద్రబాబు ఆదేశాలతో ఉగాది కానుకలు పంపిణీ చేశామన్నారు.
Updated Date - 2023-03-22T11:48:34+05:30 IST