ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nakka anand babu: ఇసుక దందాపై పెద్దిరెడ్డి బోగస్ కబుర్లు చెప్పారు

ABN, First Publish Date - 2023-08-31T17:51:04+05:30

జగన్ రెడ్డి ఇసుక దోపిడీపై వాస్తవాలు దాచి, పాపాల పెద్దిరెడ్డి బోగస్ కబుర్లు చెప్పారు. ఇసుక దోపిడీపై ప్రభుత్వ బోగస్ వ్యవహారాలు కప్పిపుచ్చడానికి మంత్రి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నలకు 6 రోజుల తర్వాత కూడా సమాధానం చెప్పలేకపోయారు.

అమరావతి: జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ రెడ్డి ఇసుక దోపిడీపై వాస్తవాలు దాచి, పాపాల పెద్దిరెడ్డి బోగస్ కబుర్లు చెప్పారు. ఇసుక దోపిడీపై ప్రభుత్వ బోగస్ వ్యవహారాలు కప్పిపుచ్చడానికి మంత్రి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నలకు 6 రోజుల తర్వాత కూడా సమాధానం చెప్పలేకపోయారు. జయ ప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ కాలపరిమితి పొడిగిస్తే.. దానికి సంబంధించిన జీవోను పెద్దిరెడ్డి ఎందుకు బయటపెట్టలేదు? తవ్వకాలకు సంబంధించిన ఎన్విరాన్ మెంట్ క్లియరెన్సులు మంత్రి ఎందుకు బయట పెట్టరు? జేపీ పవర్ వెంచర్స్ సంస్థ సబ్ కాంట్రాక్ట్ వ్యవహారం డీఎంజీకి తెలుసుంటే.. సదరు సబ్ కాంట్రాక్టర్ ఎవరో తెలియదని పెద్దిరెడ్డి చెప్పడం బుకాయింపు కాదా?, ఇసుక రీచ్‌లలో ఇష్టానుసారంగా యంత్రాలతో తవ్వకాలు జరపడానికి ఎలాంటి అనుమతులున్నాయో మంత్రి ఎందుకు బయటపెట్టలేదు?, నాలుగేళ్లలో ప్రభుత్వానికి ఇసుకపై ఇంత ఆదాయం వచ్చిందని ఎందుకు చెప్పలేదు?, ప్రభుత్వ పథకాలకు ఇసుక వాడితే.. ఏపీఎండీసీకి ఎంత రాయల్టీ కట్టారనే వివరాలు ఎందుకు చెప్పలేదు?, భూగర్భ జలవనరుల శాఖ, మైనింగ్ శాఖ, రివర్ కన్జర్వేషన్ వంటి విభాగాల అనుమతులతోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా?, రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు విధించిన స్టే వెకేట్ అవ్వలేదు. ఇసుక దోపిడీపై ఏదో ఒకరోజు న్యాయస్థానానికి జగన్ రెడ్డి సమాధానం చెప్పక తప్పదు. జగన్ రెడ్డి అతని గ్యాంగ్ విచ్చలవిడిగా సాగిస్తున్న ఇసుక దోపిడీపై బహిరంగ చర్చకు తాము సిద్ధం. పెద్దిరెడ్డి వచ్చినా, అధికారులు వచ్చినా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం.’’ అని నక్కా ఆనంద్‌బాబు పేర్కొ

Updated Date - 2023-08-31T17:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising