ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gade VenkateshwarRao: ‘ఒక పిచ్చోడు గెస్ట్‌గా రాంగోపాల్ వర్మను తీసుకు వచ్చారు’

ABN, First Publish Date - 2023-03-16T11:08:14+05:30

జనసేన 10వ ఆవిర్భావ సభలో తాము ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంటూరు: జనసేన 10వ ఆవిర్భావ సభలో తాము ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు (Janasena district president Gade Venkateswara Rao) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ విధమైన ప్రలోభాలకు ఆశపడకుండా స్వంత ఖర్చులతో లక్షలాది మంది సభకు వచ్చారని తెలిపారు. మంత్రులు అసెంబ్లీ వదిలేసి పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) మీద అనుచిత వ్యాఖ్యలు చేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తణుకులో జరిగిన టీడీఆర్ బాండ్ల అవినీతి గురించి మాట్లాడే దమ్ము మంత్రి కారుమూరు (Minister Karumuri Nageshwar rao) కు ఉందా అని ప్రశ్నించారు. జనసేన సభకు వచ్చిన స్పందన చూసి వైసీపీ నాయకులకు వణుకు మొదలైందన్నారు. నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) లోకి గెస్ట్‌గా ఒక పిచ్చోడు రాంగోపాల్ వర్మ (Ramgopal Varma) ను తీసుకు వచ్చారని... ఆ పిచ్చోడు విద్యార్థులకు ఏం చెప్పాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. సంస్కారం లేకుండా విద్యార్థులతో మాట్లాడుతున్నారన్నారు. అధికారపార్టీ వారు విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నారని గాదె వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

Updated Date - 2023-03-16T11:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising