Julakanti: పిన్నెల్లి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి..
ABN, First Publish Date - 2023-08-08T16:25:44+05:30
పల్నాడు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ బహిరంగ సభ చూసి ఓర్వలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు.
పల్నాడు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) బహిరంగ సభ చూసి ఓర్వలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ (TDP Incharge) జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) అన్నారు. మంగళవారం మాచర్లలో యువగళం క్యాంప్ (Yuvagalam Camp) నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లోకేష్ స్టాన్స్ పోర్డు విశ్వవిద్యాలయంలో చదివారు.. నీకు ఆయనతో పోలికా.. నీవు విగ్రహాల దొంగవు అవునా కాదా? ఒకప్పుడు అద్దె ఇంటిలో ఉన్న నీవు.. ఇప్పుడు ఇంత ఎలా సంపాదించావ్?, మగతనం గురించి మాట్లాడే నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీని కన్నది వాస్తవం కాదా?’’
పిన్నెల్లి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారని, మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉన్న ఆస్తి ఎంత?, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంత?.. సొంత పెదనాన్న ఆస్తులు కాజేసిన వ్యక్తి పిన్నెల్లి అని విమర్శించారు. మాచర్లలో క్వారీలు, గుట్కా ప్యాకెట్లు, అక్రమ మద్యం అన్నీ పిన్నెల్లి పేరే చెబుతాయన్నారు. మీ అవినీతిపై మాట్లాడితే బూతులతో దాడి చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాదమ్ములు పోలీస్ భద్రత లేకుండా బయటకు రాగలరా? అని సవాల్ చేశారు. ప్రజలను వాలంటీర్లతో బెదిరిస్తున్నారని, హత్య కేసులో పిన్నెల్లితో పాటు ఉన్న వారు ఇప్పుడు మీ వెంటే తిరుగుతున్నారని జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు.
Updated Date - 2023-08-08T16:25:44+05:30 IST