Kanna LakshmiNarayana: పార్టీ పేరు వైఎస్ఆర్.. ఆచరణ మాత్రం రాజారెడ్డిది..
ABN, First Publish Date - 2023-04-02T12:47:00+05:30
గుంటూరు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)పై టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kanna LakshmiNarayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
గుంటూరు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)పై టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kanna LakshmiNarayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పుట్టుకే మోసమని.. దురుద్దేశంతో ప్రారంభమైందన్నారు. పార్టీ పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)ది.. ఆచరణ మాత్రం రాజారెడ్డి (Raja Reddy)దని దుయ్యబట్టారు.
ఒక్క అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) ప్రజలను మోసం చేసి.. ధనదాహంతో పాలన చేస్తున్నారని కన్నాలక్ష్మీ నారాయణ ఆరోపించారు. స్వంత వ్యాపారాలు (own business) పెంచకోవడం తప్ప రాష్ట్రం గురించి పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో అట్రాసిటీ చట్టాన్ని (Atrocity Act) దుర్వినియోగం చేస్తున్నారని, వైసీపీ నేతలే (YCP Leaders) దాడులు చేస్తే.. పోలీసులు తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించే పరిస్దితి నెలకొందన్నారు. కౌన్సిలర్ యుగంధర్‌పై దాడి వైసీపీ రాక్షస క్రీడకు నిదర్శనమన్నారు. కౌన్సిలర్‌పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కన్నాలక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.
Updated Date - 2023-04-02T12:47:00+05:30 IST