ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Anagani: మత్య్సకారులకు అడుగడుగునా అన్యాయం..

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:23 PM

అమరావతి: మత్య్సకారులకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 8 ఫిషింగ్ హార్బర్లు, 4 జెట్టీలు కడతామన్నారని, కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఎందుకు నిర్మించలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

అమరావతి: మత్య్సకారులకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 8 ఫిషింగ్ హార్బర్లు, 4 జెట్టీలు కడతామన్నారని, కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఎందుకు నిర్మించలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. వందల బోట్లు, వేలాదిమంది మత్స్యకారులు ఉన్న జిల్లాలో మినీ హార్బర్ నిర్మాణం జరపడంలేదు.. కానీ రుషికొండలో మాత్రం రూ. 500 కోట్లతో విలాసవంతమై భవనం కట్టుకుంటున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి తన సలహాదారుల కోసం చేసే ఖర్చులో సగం కూడా మత్య్సకారులకు ఖర్చు చేయడం లేదని దుయ్యబట్టారు. మినీ హార్బర్ నిర్మాణం జగన్ హయాంలో పేపర్లకే పరిమితమైందన్నారు. ప్రాణాలకు తెగించి సముద్రంపై చేపల వేట సాగించే వారికి జెట్టీ చేపల వేట ఆధారంగా జీవిస్తున్న మత్స్యకారులను సముద్రానికి దూరం చేస్తారా? అని ప్రశ్నించారు. ఉవ్వెత్తున ఎగసిపడే అలల్ని సునాయాసంగా ఎదుర్కొనే మత్సకారులు.. వైసీపీ ప్రభుత్వ అకృత్యాలకు బలవుతున్నారని అనగాని సత్య ప్రసాద్ అన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 01:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising