Anand Babu: చంద్రబాబు బెయిల్‌పై ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడం హాస్యాస్పదం
ABN, First Publish Date - 2023-11-22T09:14:01+05:30
గుంటూరు జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావటంపై వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని, బాబును 52 రోజులు జైల్లో ఉంచటం అక్రమం అని టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.
గుంటూరు జిల్లా: తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు బెయిల్ (Bail) రావటంపై వైసీపీ నేతలు (YCP Leaders) తట్టుకోలేకపోతున్నారని, బాబును 52 రోజులు జైల్లో ఉంచటం అక్రమం అని టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. బెయిల్ ఇచ్చి హైకోర్టు (High Court) పరిధి దాటిందన్న అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వ్యాఖ్యలు దారుణమని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో మిగతా అందరూ బయటే ఉన్నారన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదైన 22 నెలల తర్వాత కేసులో చంద్రబాబు పేరు చేర్చి అరెస్టు చేశారని మండిపడ్డారు. హక్కులు అందరికీ వర్తిస్తాయన్నారు.
చంద్రబాబు బెయిల్‌పై ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)కు వెళ్లడం హాస్యాస్పదమని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేలా సర్కార్ వ్యవహరిస్తోందని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలటం ఖాయమన్నారు. పొన్నవోలు ఏఏజీలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏజెంట్‌లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వాదనల్లో పస లేదని హైకోర్టు గుర్తించి బెయిల్ ఇచ్చిందన్నారు. గతంలో అదనపు అడ్వకేట్ జనరల్ ఎవరూ మీడియా ముందు మాట్లాడలేదని, హైదరాబాద్, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే హక్కు మీకు లేదని అన్నారు. నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ ప్రభుత్వం.. చంద్రబాబుపై మద్యం లైసెన్సుల కేసు పెట్టిందని, ఉచిత ఇసుక విధానంపై కేసు పెట్టిందని నక్కా ఆనంద్ బాబు ఫైర్ అయ్యారు.
Updated Date - 2023-11-22T09:26:56+05:30 IST