ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bapatla Dist.. అమర్నాథ్ హత్యలో రాజకీయ కోణం లేదు: ఎస్పీ

ABN, First Publish Date - 2023-06-17T12:37:26+05:30

బాపట్ల జిల్లా: చెరుకుపల్లి మండలం రాజోలులో అవాంఛనీయ ఘటన జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన బాపట్లలో మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి చదువే విద్యార్థి అమర్నాథ్‌ను పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల జిల్లా: చెరుకుపల్లి మండలం రాజోలులో అవాంఛనీయ ఘటన జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన బాపట్లలో మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి చదువే విద్యార్థి అమర్నాథ్‌ను పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపారన్నారు. దీనిపై హత్య కేసు నమోదు చేశామని, ఈ ఘటనలో నలుగురు పాల్గొన్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు పాము వెంకటేశ్వరరెడ్డితో పాటు మరో ముగ్గురు కూడా ఈ హత్యలు పాల్గొన్నారన్నారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు.

అమర్నాథ్ సోదరిని వెంకటేశ్వర రెడ్డి వేదిస్తున్నాడని, ఈ విషయం తెలుసుకున్న అమర్నాథ్.. తన సోదరిని వేధిస్తున్నట్లు అందరికీ ప్రచారం చేస్తున్నాడని వెంకటేశ్వర రెడ్డి ఆగ్రహించాడని, కక్ష పెంచుకుని అమర్నాథ్‌ను చంపడానికి కుట్ర చేశాడని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో రాజకీయ కోణం ఏమీ లేదని, వ్యక్తిగతంగా జరిగిన ఘటన మాత్రమేనన్నారు. దీనికి రాజకీయ రంగు పులమొద్దని చెబుతున్నామన్నారు. గతంలో ఈ గొడవకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు లేదని, ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అనుమానితులను అరెస్టు చేశామన్నారు. క్లూస్ టీం రెండు సార్లు ఘటనా స్థలాన్ని పరిశీలించిందని ఎస్పీ తెలిపారు.

కాగా... నిన్న (శుక్రవారం) విద్యార్థి అమర్నాథ్‌ను పాము వెంకటేశ్వర రెడ్డి, మరో ముగ్గురు యువకులు కలిసి దారుణంగా హత్య చేశారు. ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విద్యార్థి హాహాకారాలతో స్థానికులు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పి వేసి విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన విద్యార్థి మృతి చెందాడు. తన అక్కను వేధించడంపై ప్రశ్నించినందుకు అమర్నాథ్‌ను నిందితులు ఇంత దారుణంగా హత్య చేశారు. తనను ప్రశ్నించడంపై ఆగ్రహంతో స్నేహితులతో కలసి పాము వెంకటేశ్వర రెడ్డి... అమర్నాథ్‌ను పెట్రోలు పోసి తగలబెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్నబిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2023-06-17T12:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising