ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Operation Kaveri: సుడాన్ నుంచి ఇండియాకు స్పెషల్ ఫ్లైట్.. స్వదేశానికి వచ్చిన ఆంధ్రా వాసి

ABN, First Publish Date - 2023-04-27T11:59:21+05:30

సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఆపరేషన్ కావేరి ముమ్మరంగా సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి పేరుతో ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో భాగంగా సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఇండియాకు చేరుకుంది. తొలి స్పెషల్ ఫ్లైట్ 360 మందితో సూడాన్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. తొలి ఫ్లైట్‌లో సూడాన్ నుంచి వచ్చిన వారిలో గుంటూరు జిల్లా చీరాలకు చెందిన విష్ణువర్ధన్ క్షేమంగా చేరుకున్నారు.

ఈ సందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ... సూడాన్‌లో ఉండలేమని.. అక్కడి పరిస్థితులకు చాలా భయంకరంగా ఉన్నాయన్నారు. ఆధిపత్య పోరు కోసం యుద్ధం జరుగుతుందని తెలిపారు. సూడాన్ నుంచి తనను ఎయిర్ లిఫ్ట్ చేశారని.. తనతో పాటు మరో ముగ్గురు ఉన్నారన్నారు. అక్కడి నుంచి బయట పడతానికి అనుకోలేదని.. పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. 12 రోజుల నుంచి యుద్ధం జరుగుతూనే ఉందన్నారు. తినడానికి తిండి లేదని.. నీళ్ళుకూడా దొరకడం లేదని చెప్పారు. అక్కడి నుంచి కొందరిని ఎయిర్ లిఫ్ట్ చేస్తే, ఇంకొందరినీ షిప్‌ల్లో జెడ్డాకు తరలిస్తున్నారని వివరించారు. సూడాన్‌ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ భవన్ అధికారులు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకున్నారని విష్ణువర్ధన్ తెలిపారు.

Updated Date - 2023-04-27T12:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising