Palnadu Dist.: క్రోసూరులో వింత కేసు..
ABN, First Publish Date - 2023-06-06T14:20:34+05:30
పల్నాడు: జిల్లాలో వింత కేసు వెలుగు చూసింది. 21 ఏళ్ల క్రితం మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు వృద్ధాప్య ఫించన్ తీసుకుంటున్న విషయం బయటపడింది.
పల్నాడు: జిల్లాలో వింత కేసు (Strange Case) వెలుగు చూసింది. 21 ఏళ్ల క్రితం మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు వృద్ధాప్య ఫించన్ (Old age Pension) తీసుకుంటున్న విషయం బయటపడింది. పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం, డొడ్లేరుకు చెందిన పారా కిరీటి 2001లో మృతి చెందాడు. జీవించి ఉండగా ఆయన ఎప్పుడూ ఫించన్ తీసుకోలేదు. అయితే ఆయన చిన్న కుమారుడు తన మామను తండ్రిగా చూపించి ఫించన్‌కు ధరఖాస్తు చేస్తే 2011లో అధికారులు మంజూరు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు వృద్దాప్య ఫించన్ చెల్లిస్తున్నారు.
ఇదే అంశంపై గత నెలలో మృతుని బంధువులు అధికారులను కలిసి కిరీటి మరణ ధృవపత్రం చెల్లించి ఫిర్యాదు చేశారు. అయినా ఈ నెలలోనూ అధికారులు రూ. 2,750 ఫించన్ ఇచ్చారు. దీనిపై మృతుని బంధువులు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరణించిన వ్యక్తి పేరుతో 12 ఏళ్లుగా అక్రమంగా ఫించన్ తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఇప్పటి వరకు రూ. 4 లక్షలకుపైగా ఫించన్ పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
Updated Date - 2023-06-06T14:20:34+05:30 IST