ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: సీఎం జగన్, ఇండియా కూటమిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-29T17:02:01+05:30

రాష్ట్ర విభజన తర్వాత ప్రణాళికబద్దంగా ఏపీని అభివృద్ధి చేయాలని భావించా. కానీ మూడు రాజధానులు పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేశారు. పోలవరం నిర్మాణం ఆగిపోయింది. పోలవరం పూర్తిచేసి నదులను అనుసంధానం చేస్తే ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచేది.

ఢిల్లీ: జగన్ ప్రభుత్వంపై (Jagan Government) టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానులు పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేశారంటూ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌తో పాటు దేశ రాజకీయాలపై ఢిల్లీలో చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ప్రణాళికబద్దంగా ఏపీని అభివృద్ధి చేయాలని భావించా. కానీ మూడు రాజధానులు పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేశారు. పోలవరం నిర్మాణం ఆగిపోయింది. పోలవరం పూర్తిచేసి నదులను అనుసంధానం చేస్తే ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచేది. నాపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు ఆర్టీఐ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నందుకు కేసులు పెడుతున్నారు. నాపై భౌతిక దాడులు చేస్తున్నారు. నాపై కేసు కూడా నమోదు చేశారు.’’ అని తెలిపారు.

జగన్ ఒక శాడిస్ట్..

జగన్ ఒక శాడిస్ట్. కరుడుగట్టిన నేరస్తుడు. సొంత బాబాయ్‌ని చంపి నాపై నిందలు మోపారు. రఘురామ కృష్ణంరాజును సీబీసీఐడీ చిత్రహింసలకు గురిచేస్తుంటే జగన్ ఆ వీడియోలు చూసి శాడిస్టిలా ఆనందం పొందారు. రాజకీయాల్లో జగన్ ఒక బచ్చా. రాజకీయంగా ఆయనకు ఉన్న అనుభవం ఎంత? రాష్ట్రానికి ఉన్న పెద్ద సమస్య జగనే. రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ను గద్దెదించాలి.’’ అని డిమాండ్ చేశారు.

ఇండియా కూటమిలో లీడర్ లేడు..

‘‘1980 నుంచే టీడీపీ జాతీయ కూటమిల్లో భాగంగా ఉంది. ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఇండియా కూటమికి లీడర్ లేకపోవడం బీజేపీకి అనుకూల అంశం. ఇండియా కూటమికి నాయకత్వం ఎవరు వహిస్తారు అనేదానిపై కామెంట్ చేయను. రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు ఎవరూ మోదీని విమర్శించడం లేదు. మోదీ వయసు గురించి మాట్లాడే దమ్ము వైసీపీ వాళ్లకు ఉందా? హైదరాబాద్ అభివృద్ధిపై నాకు ఉన్నంత సంతృప్తి ఎవరికి ఉంటుంది? నోరు ఉందికదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.’’ అని మండిపడ్డారు.

కాంగ్రెస్‌కు ఆ చాన్స్ లేదు..

‘‘ఏపీ, తమిళనాడు‌లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదు. దక్షిణాదిలో తెలంగాణ, కర్ణాటకలోనే కాంగ్రెస్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ఉంది.’’ అని తెలిపారు.

తెలంగాణలో పోటీపై..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై (Telangana Assembly Elections) టీటీడీపీ (TDP) దృష్టిసారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఓ కమిటీని నియమించాం. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ఇప్పటికే పోటీపై కమిటీ వేశాం. తెలంగాణలో బీజేపీతో (BJP) పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు సమయం మించిపోయింది.’’ అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు.

అమెరికా అసూయ పడుతోంది..

‘‘రూ. 500, ఆపై కరెన్సీ నోట్లను రద్దు చేయాలని సూచించా. అలా చేస్తే ఎన్నికల్లో నగదు పంపిణీ ఉండదు. మంచి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి. భారత దేశం టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంది. డీప్ డ్రైవ్ టెక్నాలజీస్ వినియోగంలోకి వస్తున్నాయి. వ్యవసాయం, హెల్త్ రంగాల్లో ఈ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు చూడొచ్చు. భారత్‌లో అనంతమైన సౌర శక్తి ఉంది. సౌర, పవన విద్యుత్.. సహా భారత్‌కి డెమోగ్రఫిక్ సానుకూలత చాలా ఎక్కువ ఉన్నాయి. భారత్‌కి యువ శక్తి ఉంది. దేశం అభివృద్ధి చెందిన తర్వాత ప్రజలు పిల్లలు వద్దని అనుకుంటారు. అప్పుడు యువ శక్తి తగ్గుతుంది. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనాభా పెరగాలి అని కోరుకుంటున్నా. పిల్లల్ని కనాలి అని ప్రోత్సహిస్తున్నాం. పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ప్రతి కుటుంబాన్ని మానిటర్ చేసేలా సాంకేతికత వినియోగించుకోవాలి. ప్రతీ పేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేలా చూడొచ్చు. అదాని, అంబానీ, టాటా అంటూ కొందరికే ఆస్తులు సృష్టించడం కంటే ప్రతి కుటుంబం ఆస్తి సృష్టించే అవకాశం కల్పించాలి. ప్రతీ భారతీయుడు థింక్ గ్లోబల్లి. ఇక్కడ కూర్చుని గ్లోబల్ అవసరాలు తీర్చే ఉద్యోగం చేయవచ్చు. ఇండియన్ అనేవాడు భూమి మీద ఎక్కడైనా పనిచేయగలడు. జపనీయులు గుంపుగా తప్ప విడిగా బయటకు రారు. భారతీయులు ఏ వాతావరణం అయినా తట్టుకుంటారు. ఇండియన్ కల్చర్ బెస్ట్ కల్చర్. భారతీయులను చూసి అమెరికా ప్రజలు అసూయ పడుతున్నారు.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-29T17:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising