AP High Court: అంబేద్కర్ విగ్రహం తొలగింపునకు కోర్టు బ్రేక్
ABN, First Publish Date - 2023-10-10T15:51:18+05:30
40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం అక్రమంగా తొలగిస్తుంది అంటూ హైకోర్టులో బాపట్ల జిల్లా జై భీమ్ జస్టిస్ ప్రెసిడెంట్‌కు చెందిన గురిందపల్లి సిద్ధార్థ పిటిషన్ దాఖలు చేశాడు.
అమరావతి: 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం అక్రమంగా తొలగిస్తుంది అంటూ హైకోర్టులో బాపట్ల జిల్లా జై భీమ్ జస్టిస్ ప్రెసిడెంట్‌కు చెందిన గురిందపల్లి సిద్ధార్థ పిటిషన్ దాఖలు చేశాడు. రోడ్ల ఆక్రమణ తొలగింపు అంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించటం అక్రమమని, ప్రభుత్వం ఏ నిబంధన పాటించకుండా తొలగిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. జీవో నంబర్ 53లో పొందుపరిచిన ఏ అంశాన్ని పాటించకుండా రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని తొలగించడం చట్ట విరుద్ధమని వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించకుండా విగ్రహాన్ని తొలగించడం చట్ట విరుద్ధమని శ్రావణ్ కుమార్ తెలిపారు. విగ్రహ తొలగింపులో విచారణ జరపకుండా ఎలా తొలగిస్తారు అంటూ అధికారులను ధర్మాసనం ప్రశ్నించింది. విగ్రహాన్ని తొలగించకుండా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. రికార్డులు తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
Updated Date - 2023-10-10T15:51:18+05:30 IST