ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirmala: ఏపీకి మరో రూ.689 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటన

ABN, First Publish Date - 2023-02-18T18:58:33+05:30

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh State) రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) శుభవార్త అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh State) రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) శుభవార్త అందించారు. ఏపీకి మరో రూ.689 కోట్లు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ పరిహారం కింద ఏపీకి రూ.689 కోట్లు ఇస్తామని ఆమె వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి రూ.1265 కోట్లు విడుదల చేస్తామని నిర్మలాసీతారామన్ తెలిపారు. 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు. శనివారం నుంచి జీఎస్టీ బకాయిలు చెల్లిస్తామని చెప్పామని, జీఎస్టీ పరిహారం మొత్తం పెండింగ్ బ్యాలెన్స్ జూన్‌ వరకు రూ.16,982 కోట్లు క్లియర్ చేశామని నిర్మలాసీతారామన్ అన్నారు.

ఇటీావల మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ (Telangana)కు కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.లక్షా 25వేల కోట్లు ఏమయ్యాయి?. బడ్జెట్‌లో రూ.35వేల కోట్ల కోత విధించారు. విద్యుత్‌ సంస్కరణల పేరుతో రూ.16,653 కోట్లు ఆపారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల పేరుతో రూ.15వేల 33 కోట్లు కోత విధించారు. ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రావాల్సిన రూ.5,374 కోట్లు నిలిపివేశారు. జీఎస్టీ బకాయిలు రూ.2437 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదు’’ అని మంత్రి హరీశ్‌ రావు (Minister Harishrao) ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలోని సమీకృత మార్కెట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రప్రభుత్వం రైతు రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదని నిలదీశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు అంశంపై ప్రతిపాదనలు రాలేదని చెబితే, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కరీంనగర్‌, ఖమ్మంలో ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయంటున్నారని చెప్పారు. మరో మంత్రి కిషన్‌రెడ్డి ఎనిమిది కళాశాలలు ఇచ్చామని చెబుతున్నారని.. వారిలో వారికే అయోమయం నెలకొన్నదని, గోబెల్స్‌ ప్రచారంలో కేంద్ర మంత్రులు ఆరితేరారని మండిపడ్డారు.

రాష్ట్రానికి అందించిన నిధులపై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడిన మాటలు సత్యదూరమైనవన్నారు. ఉపాధి హామీలో కేంద్రం తెలంగాణలో అడిగినన్ని పనిదినాలను ఎందుకు ఇవ్వలేదని, ఈజీఎ్‌సలో రూ.30 వేల కోట్ల కోత విధించడం దేనికి సంకేతమో చెప్పాలన్నారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ కింద నుంచి ఆరో స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. రాష్ట్ర సంపద పెరిగిందని, తెలంగాణ ఆవిర్భావ సమయంలో రూ.4.5 లక్షలుగా ఉన్న సంపద ప్రస్తుతం రూ.13 లక్షల కోట్లకు పెరిగిందని హరీశ్ రావు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

***************************************

సింహం ఎవరో నిన్నటితో తేలిపోయింది.. రోజులు దగ్గర పడ్డాయి

*****************************

ఆయన సమగ్రతను ప్రశ్నించడానికి మీకెంత ధైర్యం!

*******************************************************

Updated Date - 2023-02-18T19:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising