AP News: రెండు శాఖలకే పడ్డ జీతాలు.. మిగతా వారికి ఎప్పుడో..!
ABN, First Publish Date - 2023-09-01T16:49:48+05:30
రాష్ట్రంలో న్యాయ, పోలీసు శాఖ ఉద్యోగులకు మాత్రమే జీతాలు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మిగతా శాఖల ఉద్యోగులకు మాత్రం ఇంకా సాలరీలు పడలేదు. గ్రీన్ ఛానల్‌లో పెన్షన్ బిల్లులు ఉన్నాయి. ఆర్బీఐ ఓడీ ఇస్తేనే మిగతా
అమరావతి: రాష్ట్రంలో న్యాయ, పోలీసు శాఖ ఉద్యోగులకు మాత్రమే జీతాలు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మిగతా శాఖల ఉద్యోగులకు మాత్రం ఇంకా సాలరీలు పడలేదు. గ్రీన్ ఛానల్‌లో పెన్షన్ బిల్లులు ఉన్నాయి. ఆర్బీఐ ఓడీ ఇస్తేనే మిగతా వారికి వేతనాలు పడతాయి. ఇప్పటికే ఆర్బీఐ నుంచి వేస్ అండ్ మీన్స్ ద్వారా సర్కార్ రూ.3 వేల కోట్లు తెచ్చింది. ఓవర్ డ్రాప్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓడీ తీసుకున్నా మూడు వేల కోట్లే రానున్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ. 5500 కోట్లు అవసరం అయింది. ఇవి కాకుండా సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రూ.1850 కోట్లు అవసరం ఉంది. ఇప్పటికే ఎఫ్ఆర్‌బీఎం కింద అదనంగా రూ.5,500 కోట్లు వాడేసింది. మళ్లీ ఎఫ్ఆర్‌బీఎం కింద అదనపు రుణ పరిమితికి సర్కార్ అనుమతి కోరుతుంది. మరోవైపు ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ చుట్టూ అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు ఓ.డి లేదా కేంద్రం నుంచి నిధులు వస్తేనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు పడనున్నాయి.
Updated Date - 2023-09-01T16:49:48+05:30 IST