Palnadu Dist.: లోకేష్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలు..
ABN, First Publish Date - 2023-08-01T16:56:17+05:30
పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువతనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారపార్టీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. లోకేష్ బహిరంగసభ జరిగే ప్రాంతంలో రాత్రికి రాత్రి వైసీపీ ఫ్లెక్సీలు వెలిసాయి.
పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువతనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో అధికారపార్టీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. లోకేష్ బహిరంగసభ జరిగే ప్రాంతంలో రాత్రికి రాత్రి వైసీపీ ఫ్లెక్సీలు (YCP Flexi) వెలిసాయి. అర్థరాత్రి తర్వాత వైసీపీ నేతలు (YCP Leaders) ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ చర్యలపై టీడీపీ (TDP) శ్రేణులు మండిపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారం పల్నాడు జిల్లాలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వినుకొండ పట్టణంలో లోకేష్ బహిరంగ సభ ఉంది. ఈ క్రమంలో గత రాత్రి వైసీపీ శ్రేణులు హడావుడిగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఐదు రోజుల క్రితం టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. టీడీపీ శ్రేణులు శాంతియుత ర్యాలీ చేస్తున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు దాడి చేసి అల్లర్లు సృష్టించి.. శాంతి భద్రతల సమస్య ఉందని.. అక్కడ 144 సెక్షన్ విధించి.. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-08-01T16:56:17+05:30 IST