ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu news: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ABN, First Publish Date - 2023-10-09T18:14:18+05:30

సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎస్ఎల్‌పీపై సోమవారం వాదనలు ముగిశాయి. సోమవారం చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే రెండున్నర గంటలకుపైగా వాదనలు వినిపించారు. అయితే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) కూడా విచారణ కొనసాగనుంది.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎస్ఎల్‌పీపై సోమవారం వాదనలు ముగిశాయి. సోమవారం చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే రెండున్నర గంటలకుపైగా వాదనలు వినిపించారు. అయితే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) కూడా విచారణ కొనసాగనుంది. సోమవారమంతా చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించగా.. ప్రభుత్వ తరపు లాయర్ ముకుల్ రోహిత్గీ రేపు వాదనలు వినిపించనున్నారు. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతోంది. చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17ఏ లోని నిబంధనలను ఒక్కొక్కటిగా బెంచ్‌ ముందు హరీశ్‌ సాల్వే వివరించారు. దీంతో క్లయింట్‌ కేసులో 17ఏ వర్తించే అవకాశాలు ఉన్నాయని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ పేర్కొన్నారు.


అయితే ఈ కేసులో అందరికీ బెయిల్‌ వచ్చిందని, అరెస్ట్‌ చట్టవిరుద్ధమని సాల్వే వాధించారు. కాగా, మంగళవారం ఉదయం 10.30 గంటలకు మళ్లీ వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ కోరారు. దీంతో రోహత్గీ అభ్యర్థనకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.

Updated Date - 2023-10-09T18:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising