ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy Rain: ఏపీకి భారీ వర్షసూచన

ABN, First Publish Date - 2023-03-15T20:24:19+05:30

పశ్చిమ బెంగాల్‌ (West Bengal) నుంచి జార్ఖండ్‌ మీదుగా దక్షిణ ఒడిశా వరకూ ఒకటి, ఉత్తర తమిళనాడు (North Tamil Nadu) నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ వరకు మరొక ద్రోణులు విస్తరించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) నుంచి జార్ఖండ్‌ మీదుగా దక్షిణ ఒడిశా వరకూ ఒకటి, ఉత్తర తమిళనాడు (North Tamil Nadu) నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ వరకు మరొక ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో బంగాళాఖాతం (Bay of Bengal) నుంచి దక్షిణ, తూర్పు, ఈశాన్య భారతం వైపునకు తేమగాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలో కోస్తా, దానికి ఆనుకుని ఒడిశాలో మేఘాలు ఆవరించాయి. అక్కడక్కడా వర్షాలు కురిశాయి. బుధవారం రాత్రికి ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ, కృష్ణా జిల్లాలో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.

కాగా గురువారం సముద్రం నుంచి తేమగాలులు ప్రభావం ఎక్కువగా ఉండనున్నందున కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కోస్తాలో గురువారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు, రాయలసీమ (Rayalaseema)లో గురు, శుక్రవారాల్లో అనేకచోట్ల పిడుగులతోపాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇంకా గంటకు 40 నుంచి 50 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. ఈనెల 18వ తేదీన కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుంది. పిడుగులు, మెరుపులతోపాటు గాలులు వీచే సమయంలో ప్రజలు ఆరుబయట ఉండరాదని, ప్రధానంగా రైతులు, పశువులు, గొర్రెల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది. గాలులకు పొలాల్లో విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని రైతులకు సూచించింది.

Updated Date - 2023-03-15T20:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising