Chandrababu: ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2023-10-04T17:35:54+05:30
ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
అమరావతి: ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ ఈ రోజు వాదనలు వినిపించారు. వాదనలు కొనసాగింపు కోసం రేపటికి వాయిదా వేశారు. ప్రక్రియలో లోపాలకు, ఎవరో చేసిన తప్పులకు అప్పటి సీఎంను ఎలా బాధ్యులు చేస్తారని న్యాయవాది వాదించారు. కేసు నమోదు చేసి రెండు సంవత్సరాలు అయిందని, ఇప్పుడు నిందితుడిగా చేర్చడం ఏమిటని న్యాయవాది ప్రశ్నంచారు.
ఈ రెండు సంవత్సరాలలో కనీసం చంద్రబాబును సాక్షిగా లేదా నిందితుడిగా కూడా పిలవలేదని న్యాయవాది అగర్వాల్ వాదించారు. E Governance కౌన్సిల్ లో ఎవరినో తీసుకోమని సిఫార్సు చేస్తే అది ఎలా తప్పు అవుతుందని న్యాయవాది ప్రశ్నించారు. టెక్నికల్ కమిటీలో గానీ, టెండర్ అవార్డ్ కమిటీలో గానీ చంద్రబాబు సభ్యుడు కాదని సిద్ధార్థ అగర్వాల్ స్పష్టం చేశారు. వాదనలు కొనసాగింపు కోసం విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
Updated Date - 2023-10-04T17:37:28+05:30 IST