ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP HighCourt: పోలవరం కుడి కాలువ అక్రమ తవ్వకాలపై హైకోర్టు సీరియస్

ABN, First Publish Date - 2023-04-25T14:08:54+05:30

పోలవరం కుడి కాలువ అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం (Polavaram) కుడి కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టు (AP HighCourt) ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని పిల్లి సురేంద్ర బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గతంలో హైకోర్టులో విచారణ జరుగగా తవ్వకాలు నిలిపివేయాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. అయినప్పటికీ అక్రమ తవ్వకాలు ఆగకపోవడంపై హైకోర్టులో కోర్టు దిక్కార పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది. పిటీషనర్ తరపున న్యాయవాది పాలేటి ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపించారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమ తవ్వకాలు చేస్తున్న దృశ్యాలను న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. తవ్వకాలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించినప్పటీకి తవ్వకాలు జరపడంపై కోర్టు సీరియస్ అయ్యింది. జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఛీఫ్ ఇంజనీర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.

Updated Date - 2023-04-25T14:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising