Yuvagalam Padayatra: జగన్‌ను కాలర్ పట్టుకుని నిలదీయండి: లోకేశ్
ABN, First Publish Date - 2023-06-04T20:52:05+05:30
సీఎం జగన్ (CM Jagan) కాలర్ పట్టుకుని నిలదీయాలని టీడీపీ నేత నారా లోకేశ్ (Lokesh) పిలుపునిచ్చారు. ‘‘సీఎం సొంత జిల్లా అంటే ఎలా ఉండాలి, అభివృద్ధి చెందాలి.
మైదుకూరు: సీఎం జగన్ (CM Jagan) కాలర్ పట్టుకుని నిలదీయాలని టీడీపీ నేత నారా లోకేశ్ (Lokesh) పిలుపునిచ్చారు. ‘‘సీఎం సొంత జిల్లా అంటే ఎలా ఉండాలి, అభివృద్ధి చెందాలి. కేవలం జయంతి, వర్ధంతికి తప్ప కడప జగన్‌కు గుర్తుకు రావడం లేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోతే బాధితులకు పరిహారం అందలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ (TDP) ఒక్క సీటు గెలిపించి ఇచ్చినా అభివృద్ధి చేసి చూపాం. పులివెందులకు నీళ్లిచ్చాం. కుప్పంలో చంద్రబాబు (Chandrababu) ఇల్లు కట్టుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే ఆరునెలలుగా అనుమతే ఇవ్వలేదు. మా పాలనలో ఎక్కడా వివక్ష చూపలేదు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో కనీసం రెండు ఎంపీ, 7 అసెంబ్లీ సీట్లు గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తం, చేయకపోతే కాలరు పట్టుకుని నన్ను నిలదీయండి, జగన్ మాదిరి ముఖ్యమంత్రిని కాల్చేయండి, ఉరి తీయండి అనను ఎందుకంటే సీఎం పదవికి నేను గౌరవమిస్తాను కానీ జగన్‌కు గౌరవమివ్వను. ఒక్క ఛాన్స్ అని అవకాశమిస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ అంటేనే అభివృద్ధి. నేను మంత్రిగా ఉన్నప్పుడు 25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాం, వీధిలైట్లు వేశాం, ఇప్పుడు వీధిలైట్లు కాలిపోతే మార్చేవారు లేరు’’ అని లోకేశ్ దుయ్యబట్టారు.
బలిజలకు ప్రాధాన్యం
రాయలసీమలో బలిజలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకువచ్చింది టీడీపీ హయాంలోనే అని, కాపులకు గతంలో అమలు చేసిన 5 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని టీడీపీ లోకేశ్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదివారం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని భూమయ్యగారిపల్లె విడిది కేంద్రం వద్ద బలిజలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా బలిజలు తమకు రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యత కల్పించాలంటూ లోకేశ్ దృష్టికి తెచ్చారు.
Updated Date - 2023-06-04T20:52:05+05:30 IST